Share News

ఇండిగో మహిళా ఉద్యోగిని హత్య.. వెలుగులోకి సంచలన నిజాలు

ABN , Publish Date - Nov 19 , 2026 | 05:43 PM

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన గోండియా జిల్లాలో.. ఇండిగో మహిళా ఉద్యోగిని హత్య వర్షా తుర్కర్ (35) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇండిగో మహిళా ఉద్యోగిని హత్య.. వెలుగులోకి సంచలన నిజాలు
Gondia Case

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన గోండియా జిల్లాలో.. ఇండిగో మహిళా ఉద్యోగిని హత్య వర్షా తుర్కర్ (35) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో అతడి భార్య మోనా అగర్వాల్ (41) ఈ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వర్షా తుర్కర్ నవంబర్ 14న తన స్నేహితుడు నితేష్ అగర్వాల్‌తో కలిసి బయటకు వెళ్లగా.. తిరుగు ప్రయాణంలో బోండ్రాని గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆగారు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు వర్షాపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


రూ.13 లక్షలకు హత్యకు సుపారీ.. నలుగురు అరెస్ట్..

ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. సుమారు 200 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుల కుట్రను గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. మోనా అగర్వాల్ తన భర్తకు వర్షాతో ఉన్న సంబంధాన్ని సహించలేక కునాల్ కుంభల్కర్ సహాయంతో హత్యకు పథకం వేసింది. అనంతరం షారుఖ్ పఠాన్ ద్వారా రూ.13 లక్షలకు సుపారీ కుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కుట్రలో భాగంగా ముగ్గురు దుండగులు నితేష్ కారును వెంబడించి, వర్షాను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మోనా అగర్వాల్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

శ్రీనగర్‌లో మైనస్ 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. ధాబాలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు మృతి

Updated Date - Nov 19 , 2026 | 06:33 PM