శ్రీనగర్‌లో మైనస్ 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:25 PM
చలి పులికి జమ్మూకశ్మీర్ గజగజా వణికిపోతోంది. కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ టెంపరేచర్లకు పడిపోయాయి. జమ్మూకాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో ఈ సీజన్‌లో అత్యంత చల్లని రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది.
ఇంటర్నెట్ డెస్క్: చలి పులికి జమ్మూకశ్మీర్ గజగజా వణికిపోతోంది. కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ టెంపరేచర్లకు పడిపోయాయి. జమ్మూకాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో ఈ సీజన్‌లో అత్యంత చల్లని రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం రాత్రి శ్రీనగర్‌లో మైనస్ 0.2 డ్రిగీల సెల్సియస్ రికార్డు అయింది. ఇంతకుముందు ఈ రికార్డు మైనస్ 3.4 డ్రిగీల సెల్సియస్‌తో షోపియాన్‌లో ఉండేది. ఇక టూరిస్టు ప్రాంతాలైన గుల్మార్గ్, పహల్గాంలోనూ మైనస్ డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో మైనస్ 2.8 డిగ్రీలు, బారాముల్లా జిల్లాలో మైనస్ 1.0 డిగ్రీలు, కశ్మీర్ గేట్‌వే కాజీగుండ్‌లో మైనస్ 0.8 డిగ్రీలు, కుప్వారాలో మైనస్ 1.3, కోకర్‌నాగ్‌లో 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కాగా.. గురువారం కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి ఎండ కాచింది. అయినా కూడా చాలా చోట్ల మంచు కురిసింది. ఇక జమ్మూ ప్రాంతంలోని జమ్మూ సిటీలో ఉష్ణోగ్రత 10.8 డిగ్రీలు, కట్రాలో 10.9, బటేలోలో 5.7, బనిహాల్‌లో 8.7, భదేర్వాలో 2.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఈనెల చివరి వరకు కశ్మీర్ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..
జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్.. కొట్టివేసిన సుప్రీంకోర్టు