రాహుల్ ఫోన్‌కు స్పందించని స్టాలిన్!
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:15 AM
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ ఫోన్ చేసినా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడేందుకు నిరాకరించారు.
రాహుల్ ఫోన్‌కు స్పందించని స్టాలిన్!
చెన్నై, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ ఫోన్ చేసినా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడేందుకు నిరాకరించారు. సోనియా ఆత్మకథ పుస్తకావిష్కరణ రెండు రోజుల క్రితం ఢిల్లీలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు రాహుల్‌గాంధీ ఇటీవల స్టాలిన్ కార్యాలయానికి ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తిన సిబ్బంది.. స్టాలిన్‌కు విషయం చెప్పగా, తాను బిజీగా ఉన్నానంటూ మాట్లాడేందుకు నిరాకరించినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై బుధవారం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ సోనియా పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తనను ఎవ్వరూ నేరుగా పిలవలేదన్నారు. వారి సహాయకులతో ఆహ్వానం పలికినందున, తాను కూడా తన సహాయకుల ద్వారా శుభాకాంక్షలు తెలియపరిచానని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..
జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్.. కొట్టివేసిన సుప్రీంకోర్టు