నిర్దోషిగా ప్రకటించినా ఏడేళ్లు జైలులోనా..!
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:50 AM
హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన తరువాత కూడా ఏడేళ్లు జైలు గోడలకే పరిమితమైన దేవీలాల్ గోండ్ అనే వ్యక్తికి రూ.30 లక్షలు పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది
బాధితుడికి 30 లక్షలు చెల్లించండి: సుప్రీం
న్యూఢిల్లీ: హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన తరువాత కూడా ఏడేళ్లు జైలు గోడలకే పరిమితమైన దేవీలాల్ గోండ్ అనే వ్యక్తికి రూ.30 లక్షలు పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్రమంగా జైలు శిక్ష అనుభవించిన వ్యక్తులకు పరిహారం చెల్లించడానికి చట్టబద్ధమైన యంత్రాంగం లేకపోవడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. హత్యా నేరంపై గోండ్ 2012 డిసెంబరులో అరెస్టయ్యాడు. సెషన్ కోర్టు అతనికి యావజ్జీవ శిక్ష విధించగా... 2018లో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే హైకోర్టు తీర్పు కాపీ జైలుకు చేరకపోవడంతో దేవీలాల్ విడుదల కాలేదు. దీనిపై సుప్రీం ధర్మాసనం విచారించింది. ‘28 ఏళ్ల వయస్సులో నిర్దోషిగా విడుదల కావాల్సిన వ్యక్తి తన 35వ ఏట జైలు నుంచి బయటకు వచ్చాడు. అత్యంత విలువైన యవ్వన కాలమంతా నిస్తేజంగా జైలు గోడల మధ్య ఉండిపోయాడు’ అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..
జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్.. కొట్టివేసిన సుప్రీంకోర్టు