30ఏళ్లలో 436 విపత్తులు..78వేల మరణాలు
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:03 AM
నిన్న మురసు, మొన్న అర్ణబ్ తుఫానులు ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలను ఎంతగా అతలాకుతలం చేశాయో చూశాం.
భారత్‌లో ప్రకృత్తి విపత్తుల తీవ్రత ఇది
క్లైమేట్ రిస్క్ ఇండెక్స్‌లో 10వ స్థానం
కాప్-31లో జర్మన్‌వాచ్ నివేదిక విడుదల
న్యూఢిల్లీ, నవంబరు 18: నిన్న మురసు, మొన్న అర్ణబ్ తుఫానులు ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాలను ఎంతగా అతలాకుతలం చేశాయో చూశాం. అంతకుముందు కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వరదలు, కొండ చరియలు కూలి భారీ ప్రాణ, ఆస్తి నషాన్ని మిగిల్చాయి. ఇలా వాతావరణ మార్పుల కారణంగా గత 30 ఏళ్లలో(1996-2025) అత్యధికంగా ప్రభావితమైన ప్రపంచంలోని పది దేశాల్లో భారత్ 10వ స్థానంలో నిలిచింది. ఈ కాలంలో దేశంలో 436 విపత్తులు సంభవించగా..దాదాపు 78 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వీటి కారణంగా 178 బిలియన్ డాలర్ల (సుమారు 15.8 లక్షల కోట్లు) ఆర్థిక నష్టం వాటిల్లినట్లు జర్మనీకి చెందిన పరిశోధనా సంస్థ ‘జర్మన్‌వాచ్’ వెల్లడించింది.
తుర్కియేలో జరుగుతున్న కాప్31 వాతావరణ సదస్సులో భాగంగా ‘క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2027’ (సీఆర్‌ఐ) నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా గత 30ఏళ్లలో వాతావరణ మార్పుల కారణంగా తలెత్తిన ప్రకృతి విపత్తులు, కరువులతో(10వేల ఘటనలు) 9.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. 4.7ట్రిలియన్ డాలర్ల(రూ.439 లక్షల కోట్లు) నష్టం ఎదురైంది. గత 30 ఏళ్లలో అధిక విపత్తులు ఎదుర్కొన్న దేశంగా డొమినికా ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. మయన్మార్, హోండూరస్, లిబియా, హైతీ, గ్రెనడా, ఫిలిప్పీన్స్, నికరగ్వా, బహమాస్, భారత్ టాప్ 10లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..
జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్.. కొట్టివేసిన సుప్రీంకోర్టు