స్టాలిన్ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:41 PM
డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడించిన టీవీకే ఎమ్మెల్యే బీఎస్ బాబు (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడించిన టీవీకే ఎమ్మెల్యే బీఎస్ బాబు (75) కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన కార్డియాక్ అరెస్టుతో గురువారం మధ్యాహ్నం 2.24 గంటలకు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఎంజీఎం ఆసుపత్రి ఒక బులెటిన్లో వెల్లడించింది. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఎమ్మెల్యేను ఆయన కుటుంబ సభ్యులు ఈ ఏడాది సెప్టెంబరు 9న ఎంజీఎంలో అడ్మిట్ చేయించారు.
చికిత్స తీసుకుంటుండగా గురువారం మధ్యాహ్నం 2.14 గంటలకు ఆయన కార్డియాక్ అరెస్టుకు గురయ్యారని, 2.24 గంటలకు ప్రాణాలు కోల్పోయారని ఎంజీఎం వైద్యులు తెలిపారు. ఆయనను కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశామని, అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వెల్లడించారు. ఆయనకు చికిత్స అందిస్తున్న క్రమంలోనే కార్డియాక్ అరెస్టుకు గురయ్యారని వివరించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని ఎంజీఎం యాజమాన్యం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..
జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్.. కొట్టివేసిన సుప్రీంకోర్టు