Share News

బీఎస్ 6 వాహనాలకు ఇక మూడేళ్లకోసారి పీయూసీసీ

ABN , Publish Date - Nov 19 , 2026 | 03:52 PM

భారత్ స్టేజ్ (బీఎస్) వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (పీయూసీసీ) వ్యాలిడిటీ విషయంలో పలు కీలక మార్పులు చేసింది.

బీఎస్ 6 వాహనాలకు ఇక మూడేళ్లకోసారి పీయూసీసీ

ఇంటర్నెట్ డెస్క్: భారత్ స్టేజ్ (బీఎస్) వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (పీయూసీసీ) వ్యాలిడిటీ విషయంలో పలు కీలక మార్పులు చేసింది. బీఎస్ 6 వాహనాలకు ప్రస్తుతం సంవత్సరానికి ఒకసారి పీయూసీసీ ఇస్తుండగా.. దానిని మూడేళ్లకు పెంచారు. దీంతో బీఎస్ 6 వాహనాదారులు తమ వాహనాలకు ఏడాదికోసారి రెన్యువల్ చేయించాల్సిన అవసరం ఉండదు. మూడేళ్లకోసారి చేయిస్తే సరిపోతుంది. అలాగే, బీఎస్ 6 వాహనాలకు పీయూసీసీ వ్యాలిడిటీని 6 నెలలకు, అంతకన్నా పాత వాహనాలకు మూడు నెలలకు తగ్గించారు. ఈ మేరకు కేంద్ర మోటారు వాహనాల చట్టం నిబంధనలు 2026ను కేంద్రం నోటిఫై చేసింది.


తాజా నిబంధనల ప్రకారం.. కొత్త వాహనం కొంటే మూడేళ్లకోసారి చొప్పున ఆరు సంవత్సరాల్లో రెండుసార్లు పీయూసీసీ చేయించాలి. 6 నుంచి 10 ఏళ్ల వాహనానికి ఏటా రెన్యువల్ చేయించాలి. పదేళ్లు పైబడితే ఆరునెలలకు ఒకసారి రెన్యువల్ చేయించాలి. బీఎస్ 6 రవాణా వాహనాలకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ తర్వాత ఆరేళ్ల వరకు ప్రతి రెండేళ్లకు ఒకసారి పీయూసీసీ చేయించాలి. 6 నుంచి 10 ఏళ్ల వరకు ఏటా రెన్యువల్ తప్పనిసరి. వాహనం పదేళ్లు దాటితే ప్రతి ఆరు నెలలకు ఒకసారి రెన్యువల్ తప్పనిసరి. అలాగే బీఎస్ 1, 2, 3 వాహనాల పీయూసీసీ వ్యాలిడిటీని మూడు నెలలకే పరిమితం చేశారు. బీఎస్ 4 వాహనాలకు రెన్యువల్ గడువును 6 నెలలకు తగ్గించారు. ప్రస్తుతం పర్సనల్ బీఎస్ 1, 2, 3, 4 వాహనాలకు ప్రతి ఆరునెలలకు ఒకసారి పీయూసీసీ రెన్యువల్ నిబంధన అమల్లో ఉంది.


ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..

జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్‌.. కొట్టివేసిన సుప్రీంకోర్టు

Updated Date - Nov 19 , 2026 | 03:52 PM