Share News

'అతిపెద్ద ద్రోహి'.. ఖవాజాపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఆగ్రహం!

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:22 PM

2018లో జరిగిన బాల్ టాంపరింగ్ వివాదంపై ఆత్మకథలో ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలతో క్రికెట్ ప్రపంచంలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సహచర ఆటగాళ్లకు నమ్మకద్రోహం చేశాడంటూ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఫ్యానీ డివిలియర్స్ విమర్శించాడు.

'అతిపెద్ద ద్రోహి'.. ఖవాజాపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఆగ్రహం!
Usman Khawaja

స్పోర్ట్స్ డెస్క్: 2018 నాటి ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ కుంభకోణంపై మాజీ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథ 'సబర్' ('Sabr')లో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు ఎనిమిదేళ్ల క్రితం నాటి వివాదం తాజాగా క్రికెట్ ప్రపంచంలో మరోసారి దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఖవాజాపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఫ్యానీ డివిలియర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత 40-50 ఏళ్ల క్రికెట్ ప్రస్థానంలో తాను చూసిన 'అతిపెద్ద ద్రోహి' ఖవాజానేనని ఘాటుగా విమర్శించారు.


2018 కేప్‌టౌన్ టెస్టులో బాల్ టాంపరింగ్ వ్యవహారం బయటపడినప్పుడు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై మాత్రమే వేటు పడింది. అయితే జట్టులోని అందరికీ ఈ విషయం తెలుసని తాజాగా ఖవాజా తన ఆత్మకథ పుస్తకంలో పేర్కొన్నాడు. అంతేకాకుండా గెబెర్హా టెస్టులోనూ శాండ్‌పేపర్ వాడారని, 2017-18 యాషెస్ సిరీస్‌లోనూ సీమ్‌ను లేపి రివర్స్ స్వింగ్ కోసం ప్రయత్నించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో పెర్త్‌లోని ఓ రేడియో ఛానల్‌తో డివిలియర్స్ మాట్లాడుతూ.. ఖవాజా తన సహచర ఆటగాళ్లను అమ్మేసుకున్నాడని ఆరోపించాడు. తన స్వార్థం కోసం, తన ఆత్మకథ పుస్తకంపై అందరిలో ఆసక్తి పెంచేందుకు.. తన సహచర ఆటగాళ్లను అమ్మేశాడంటూ డివిలియర్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.


'జట్టులో ఉండాల్సిన క్రమశిక్షణ, స్నేహబంధాలను ఖవాజా దెబ్బతీశాడు. డ్రెసింగ్ రూమ్‌లో జరిగిన విషయాలను బయటకు చెప్పి.. ఆటగాళ్లకు నమ్మక ద్రోహం చేశాడు. అలానేఎప్పుడో ముగిసిపోయిన తప్పును మళ్లీ తవ్వితీసి ఆస్ట్రేలియా క్రికెట్ ప్రతిష్ఠకు భంగం కలిగించాడు. ఖవాజా తన స్వార్థం కోసం ఊహించని స్థాయిలో తప్పులు చేసి.. ఆస్ట్రేలియా జట్టుకు ద్రోహం చేశాడు' అని డివిలియర్స్ మండిపడ్డారు. మరోవైపు బాల్ ట్యాంపరింగ్ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్వతంత్ర విచారణ వేదికను ఏర్పాటు చేసింది.


ఇవి కూడా చదవండి:

జడేజాను పక్కనపెట్టడం అన్యాయం.. టీమిండియా నిర్ణయంపై అశ్విన్ ఆగ్రహం!

రోహిత్ శర్మ సరసన గ్లెన్ ఫిలిప్స్.. అరుదైన రికార్డు!

Updated Date - Nov 20 , 2026 | 12:28 PM