ఒంటిపై రూ.10 కోట్ల బంగారం.. రామకథకు వచ్చిన బిహార్ గోల్డ్ మ్యాన్..
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:02 PM
కిలోల కొద్దీ బంగారాన్ని ధరిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బిహార్‌కు చెందిన ప్రేమ్‌కుమార్ సింగ్. ఈయనను అందరూ గోల్డ్ మ్యాన్ అని పిలుస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.
ఇంటర్నెట్ డెస్క్: కిలోల కొద్దీ బంగారాన్ని ధరిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బిహార్‌కు చెందిన ప్రేమ్‌కుమార్ సింగ్. ఈయనను అందరూ గోల్డ్ మ్యాన్ అని పిలుస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా కుందాలో రాజకీయ నాయకుడు రాజా భయ్యా నిర్వహించిన శ్రీరామకథ కార్యక్రమానికి ప్రేమ్ కుమార్ సింగ్ హాజరయ్యారు. ఏకంగా 6.3 కిలోల బంగారు ఆభరణాలు ధరించి అక్కడికి చేరుకున్నారు. వాటి విలువ రూ.10 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం (Bihar Gold Man).
ప్రేమ్ కుమార్ సింగ్ ఒంటిపై భారీ బంగారు గొలుసులు, చేతులకు కంకణాలు, ఇతర ఆభరణాలు ధరించి రామకథ కార్యక్రమానికి వచ్చారు. ఆయన ప్రత్యేకమైన అలంకరణ అక్కడి వారందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ కార్యక్రమానికి వచ్చిన భక్తులు, సందర్శకులు గోల్డ్ మ్యాన్‌ను చూసేందుకు ఆసక్తి చూపించారు. చాలామంది ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ప్రేమ్ కుమార్ సింగ్ బిహార్‌లోని భోజ్‌పుర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయనకు బంగారు ఆభరణాలంటే ఎంతో ఇష్టం. భారీ మొత్తంలో బంగారం ధరించే అలవాటు కారణంగా ఆయన 'గోల్డ్ మ్యాన్ ఆఫ్ బిహార్'గా గుర్తింపు పొందారు (10 Crore Gold Jewellery).
ప్రేమ్‌కుమార్ వృత్తిరీత్యా రైతు, ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా కూడా వ్యవహరిస్తుంటారు (Viral News India). బంగారు గొలుసులు, ఉంగరాలు, కంకణాలు వంటి అనేక రకాల ఆభరణాలు ఆయన దగ్గర ఉన్నాయి. వీటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఆయన దగ్గర 24 క్యారెట్ల బంగారు పూతతో ప్రత్యేకంగా తయారు చేయించిన బుల్లెట్ బైక్ కూడా ఉంది. ప్రతిరోజు సుమారు ఏడు కిలోల బంగారు ఆభరణాలు ధరిస్తానని ప్రేమ్ కుమార్ సింగ్ చెప్పారు. అయితే బిహార్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు ప్రయాణం చేయాల్సి రావడంతో ఈసారి కొంత తక్కువ ఆభరణాలు ధరించానన్నారు. అయినప్పటికీ ఆయన ఒంటిపై 6.3 కిలోలకు పైగా బంగారం ఉంది.
ఇవి కూడా చదవండి..
గతంలో ఇరాక్‌పై కూడా ఇలాంటి ప్రచారమే చేశారు: ఇరాన్
బంగ్లాదేశ్‌లో హింస.. భారత్‌పైనా ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఆరోపణలు..