Share News

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:57 AM

సొంతపార్టీ నేతలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని దొంగలకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టకండి అంటూ మంత్రులకు ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేశారు.

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్
Komatireddy Raj Gopal Reddy

హైదరాబాద్, నవంబర్ 20: సొంతపార్టీ నేతలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని దొంగలకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టకండి అంటూ మంత్రులకు ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేశారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శించారు. కనీసం కాంగ్రెస్ మంత్రులైనా నిజాయితీగా పాలన చేయాలని హితవుపలికారు. పేదలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి విషయంలో న్యాయంగా వ్యవహరించాలన్నారు.


ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నానని ఎమ్మెల్యే అన్నారు. అహంకారంతో మాట్లాడటం మానేసి మంచిగా పాలనచేయాలన్నారు. మంచి పాలన అందిస్తే ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తారని తెలిపారు. ‘ప్రతిపక్షాలపై విరుచుకుపడటం కాదు.. మీరిచ్చిన హామీలేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి?’ అని ప్రశ్నించారు. నిజాయితీగా, అవినీతి లేకుండా పాలన చేస్తున్నారా లేదా అనేది ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ రాష్ట్ర మంత్రులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్‌లో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. పలువురికి గాయాలు

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 12:00 PM