Share News

ఉద్రిక్తతలు సృష్టించి మాపై నెపం నెట్టే ప్రయత్నం.. అవినాశ్‌ రెడ్డిపై బీటెక్‌ రవి ఫైర్

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:28 AM

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిపై పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినాశ్ రెడ్డి ఉద్రిక్తతలు సృష్టించి ఆ నెపం తమపై నెట్టడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు.

ఉద్రిక్తతలు సృష్టించి మాపై నెపం నెట్టే ప్రయత్నం.. అవినాశ్‌ రెడ్డిపై బీటెక్‌ రవి ఫైర్
TDP Leader Btech Ravi

అమరావతి, నవంబర్ 20: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిపై పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. అవినాశ్ రెడ్డి ఉద్రిక్తతలు సృష్టించి ఆ నెపం తమపై నెట్టడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. సింహాద్రిపురం ఘటనపై వైసీపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే అవినాశ్ రెడ్డి 30 నుంచి 50 వాహనాలతో సింహాద్రిపురం రావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.


అర్బన్ ఓటరు అయిన ఎంపీ.. సింహాద్రిపురం రావడం వెనుక ఉద్దేశం ఏంటని బీటెక్ రవి నిలదీశారు. గతంలో మున్సిపాలిటీలో జరిగిన ఫైరింగ్ ఘటనతో పాటు, నేటి ఘటనలోనూ అవినాశ్ రెడ్డి, దుశ్యంత్ రెడ్డిల పాత్రపై విచారణ జరగాలన్నారు. పులివెందుల ఘటనలపై సమగ్ర విచారణ జరిపి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బీటెక్ రవి కోరారు.


ఈరోజు ఉదయం పులివెందుల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు చివరిరోజు. టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి సొంతూరు సింహాద్రిపురం మండలంలో ఎంపీ అవినాశ్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు దగ్గర అవినాశ్, బీటెక్ రవి వాహనాలు ఎదురుపడ్డాయి. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడులకు దిగడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణ నెలకొంది.


ఇవి కూడా చదవండి...

గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటిన ‘అక్వాన్’ తుపాను.. 90 కి.మీ. వేగంతో గాలులు

జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థుల ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 11:43 AM