Share News

జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థుల ఖరారు

ABN , Publish Date - Nov 20 , 2026 | 10:40 AM

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ సహా నాలుగు జిల్లాలకు ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేసింది.

జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థుల ఖరారు
jana Sena Party

అమరావతి, నవంబర్ 20: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఛైర్మన్‌లతో పాటు వైస్‌ ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను కూడా పార్టీ విడుదల చేసింది. నాలుగు జిల్లాలకు జడ్పీ ఛైర్మన్ అభ్యర్థులను, మరో ఐదు జిల్లాలకు వైస్ ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించింది.


ఛైర్మన్ అభ్యర్థులు వీరే...

  • శ్రీకాకుళం: కొరికాన భవాని (ఎల్.ఎన్.పేట జడ్పీటీసీ)

  • పార్వతీపురం మన్యం: నిమ్మల నీలిమ (భామిని జడ్పీటీసీ)

  • అనకాపల్లి: మోటూరు నాగమణి (పరవాడ జడ్పీటీసీ)

  • కాకినాడ: బుర్రా దివ్య సునీత రాజ్ (పెద్దాపురం)


ఐదు జిల్లాల్లో వైస్ ఛైర్మన్లు

  • తూర్పు గోదావరి: పల్నాటి రజని (నిడదవోలు)

  • డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ: ఎలిశెట్టి రామకృష్ణ (కొత్తపేట)

  • బాపట్ల: కలవకూరి పిచ్చమ్మ (పర్చూరు)

  • ప్రకాశం: వరికూటి లక్ష్మీ తాయారు (దర్శి)

  • శ్రీ సత్యసాయి: దాసరి సునేత్ర (గోరంట్ల)


ఇవి కూడా చదవండి...

మూడో విడత సమరానికి సై

గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటిన ‘అక్వాన్’ తుపాను.. 90 కి.మీ. వేగంతో గాలులు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 11:09 AM