ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. అర్ధరాత్రి 40 కిలోమీటర్ల ప్రయాణం
ABN , Publish Date - Nov 20 , 2026 | 10:22 AM
ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి.. అర్ధరాత్రి 40 కిలోమీటర్లు ప్రయాణించి చీమలపాడు అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు.
ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 20: జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి.. అర్ధరాత్రి 40 కిలోమీటర్లు ప్రయాణించి చీమలపాడు అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. మార్గమధ్యలో జాతీయ రహదారిని కూడా దాటి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం. ట్రాకర్ ద్వారా పులి కదలికలను అటవీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
చీమలపాడు అటవీ ప్రాంతంలో పులి కదలికలను అటవీ అధికారులు గుర్తించారు. గతంలోనే పెద్దపులికి అమర్చిన ట్రాకర్ ద్వారా దాని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పులి ఎటువైపు వెళ్తుందో అన్న దానిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో తిరువూరు అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు నిర్లక్ష్యం చేయవద్దని తిరువూరు ఆర్డీవో ఏ.కుమార్ హెచ్చరించారు. పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని, పులి కనిపిస్తే దాని సమీపానికి వెళ్లకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ఏ.కుమార్ సూచించారు.
ఇవి కూడా చదవండి...
గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటిన ‘అక్వాన్’ తుపాను.. 90 కి.మీ. వేగంతో గాలులు
హైదరాబాద్‌లో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. పలువురికి గాయాలు
Read Latest AP News And Telugu News