Share News

బాధలు భరిస్తూ.. బాధ్యతలు నెరవేరుస్తూ..

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:33 PM

మగాళ్లు అంటే బాధించే వాళ్లని ఒకప్పుడు అనుకు నేవారు. కానీ ఇప్పుడు బాధను దిగమింగుకునే వారీగా మిగిలిపోతున్నారు. తమ కోరికలను బలవంతంగా తన లోనే దాచుకొని నలిగిపోతున్నారు.

 బాధలు భరిస్తూ.. బాధ్యతలు నెరవేరుస్తూ..
International Men's Day,

  • నేడు పురుషుల దినోత్సవం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

మగాళ్లు అంటే బాధించే వాళ్లని ఒకప్పుడు అనుకు నేవారు. కానీ ఇప్పుడు బాధను దిగమింగుకునే వారీగా మిగిలిపోతున్నారు. తమ కోరికలను బలవంతంగా తన లోనే దాచుకొని నలిగిపోతున్నారు. ఇంట్లో అందరిలో హడల్‌గా వ్యవహరిస్తూ ఇంటిపెద్దగా గౌరవ మర్యాదలు అందుకున్న మగాళ్లు వెనుకబాటుతనాన్ని కూడా అను భవిస్తున్నారు.మహిళలు ఉద్యోగ రంగాల్లో రాణిస్తూ తన సంపాదన కూడా మొదలు కావడంతో కుటుంబ వ్యవ స్థలో ఆమెసామర్థ్యం కూడా అన్ని రంగాల్లో మొదలైంది. మహిళలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా వారు ఎ ప్పటికప్పుడు బహిరంగంగా ముందుకు తీసుకువస్తున్నా రు. కానీ ఇంటి బాధ్యతలు మోసే మగవాళ్లు మాత్రం బ హిరంగ చర్చకు తమ సమస్యలు తీసుకరావడం లేదు.


మౌనంగా రోదిస్తూ...

ఎన్నో సమస్యలతో బాధపడుతూ మౌనంగా రోదిస్తున్న పురుషులూ ఉన్నారు. కేవలం పురుషుడు ఉద్యోగం చేస్తే సరిపోయే పరిస్థితులు కూడా లేవు. చాలామంది పురుషులు వంట పని మిన హాయిస్తే ఇంటి పనులన్నీ చక్కబెడుతూ తమ ఉద్యోగాలు, పనులకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మనస్సు బాధతో కరిగిపోతున్నా బయటకు ఏడ్చే పరిస్థితి కూడా లేదు. ఏడ్చే మగాన్ని నమ్మవద్దంటూ ఎత్తిపొడు పు మాటలు కూడా పడాల్సిందే. మగ వాళ్లకు మనస్సు ఉంటుందని, వారు కూడా గాయపడతారని ఆడవాళ్లు నమ్మని పరిస్థితి ఉంది. మగాళ్లంటే రఫ్‌ అండ్‌ టఫ్‌ అనే ఒక అభిప్రాయంతో మగవాళ్లను వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇం ట్లో, బయట కష్టపడే మగవాళ్లను కదిలిస్తే తాము తెల్ల వారుజామునే లేస్తామని తనతోపాటు పిల్లలను రెడీ చేసి 8గంటల కల్లా స్కూల్‌కు వెళుతామని తెలిపారు.


jmt2.3.jpgఆ తరువాత మార్కెట్‌, ఇతర పనులు చూసి ఆఫీస్‌ కు వెళుతామని, ఆఫీస్‌లో కూడా అనేక సమస్యలు ఎదు ర్కొని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఖా ళీగా మగవాళ్లు ఉంటారని అనుకోవద్దని పిల్లల గురించి, చదువుల గురించి పట్టించు కోవాలని, చిన్న ఉద్యోగం, ఆదాయం తక్కువ ఉంటే సాయంత్రం పార్ట్‌ టైం పను లు కూడా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇలా ఎన్ని బాధలుపడ్డా మగవాళ్లు మాత్రం భార్య, పిల్లలు అందరి ఆశలకు, ఆకాంక్షలకు నెరవేరుస్తున్నారు. తనవాళ్ల ఎదుగుదలకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు.


పురుషుల సంక్షేమ సంఘం..

మహిళలకు దినోత్సవం ఉన్నట్లే మగవాళ్లకి ఒకరోజు ఉంది. నవంబరు 19 అంతర్జాతీయ పురుష ది నోత్సవంగా వంద దేశాల్లో పురుష పతాకం రెపరెపలాడుతోంది. మనదేశంలో బెంగుళూర్‌లో పురుషుల సంక్షేమ సంఘం ఏర్పడింది. మహిళల్లాగే పురుషులకు హక్కులు ఉంటాయని వాటిని కాపాడాల్సిన అవసరం ఉంటుందని ఈ సంఘం భావిస్తుంది. పురుషుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి డబ్బులు ఖర్చు చేయలేదని, రాజ్యాంగ బద్ధంగా ఎలాంటి సంస్థను ఏర్పాటు చేయలేదని గుర్తించారు. అందు కే జాతీయ పురుషుల కమిషన్‌, పురుష సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మానసిక ఒ త్తిళ్లలో పురుషులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారని వాటి నివారణకు కూడా ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్రతి కుటుంబానికి బీమా.. అందరికీ ధీమా

నీటి పొదుపుపై పాఠశాలల్లో పాఠాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 12:33 PM