రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ గింజలేవి?
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:05 PM
పేదల కు ఆహార భద్రతతో పాటు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి ప్రస్తుతం బ్రేక్ పడింది.
పోషక బియ్యం పంపిణీపై సందిగ్ధం
జమ్మికుంట(కరీంనగర్): పేదల కు ఆహార భద్రతతో పాటు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి ప్రస్తుతం బ్రేక్ పడింది. సన్నబియ్యం పంపిణీ ప్రారం భమైన నేపథ్యంలో రేషన్ బియ్యంలో పోషక విలువలు కలిగిన ఫోర్టిఫైడ్ గింజలు కనిపించడం లేదు. దీనికి సన్నబియ్యం పథకమే కారణం కాదు. 2026 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఫోర్టిఫైడ్ రైస్ తయారీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణ యం తీసుకుంది.
దీంతో ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారు లకు అందుతున్న బియ్యంలో పోషక గింజలు కనిపిం చడం లేదు. రక్తహీనత, సూక్ష్మ పోషకాహార లోపా లను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫోరి ్టఫైడ్ రైస్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సాధారణ బియ్యంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12 వంటి పోషకాలను కలిగిన ప్రత్యేక గింజలను కలిపి పంపిణీ చేసేవారు. సాధారణ బియ్యంతో పోలిస్తే అదనపు పోషక విలువలు అందించడం దీని ఉద్దేశం. ముఖ్యంగా పేద కుటుంబాలు, పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు ఈ కార్యక్ర మాన్ని అమలు చేశారు.

నిల్వలే అసలు సమస్య
ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీని తాత్కాలికంగా నిలిపివేయ డానికి కేంద్రం వెల్లడించిన కారణం గోదాముల్లో బియ్యం నిల్వ ఉండే కాలం. ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్య యనం ప్రకారం తేమ, ఉష్ణోగ్రత, నిల్వ పరిస్థితు లు, ప్యాకింగ్ ప్రభావంతో ఫోర్టిఫైడ్ గింజల్లోని సూక్ష్మ పోషకాల స్థాయిలు తగ్గే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం బియ్యం నిల్వ లు రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు గోదాముల్లో ఉంటున్నాయి. దీంతో ఆశించిన స్థాయిలో పోషకాలు లబ్ధిదారులకు అందడం లేదని గుర్తించి మెరుగైన విధానం రూపొందించే వరకు ఫోర్టిఫికేషన్ ప్రక్రియను నిలిపివేసింది.
సాధారణంగా క్వింటాల్ బియ్యంలో కిలో ఫోర్టిఫైడ్ రైస్ (ఎఫ్‌ఆర్‌కే) కలపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ రైస్ మిల్లుల్లోనే జరుగుతుంది. అనంతరం నాణ్యతా ప్రమాణాలు పరిశీలించి ప్రభుత్వానికి సరఫ రా చేయాలి. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పాత విధానంలోనే ఫోర్టిఫైడ్ బియ్యం కల పాలా, సాధారణ బియ్యం సరఫరా చేయాలా అనే విష యంలో రాష్ట్రాలకు 2025-26 వానాకాలం సీజన్‌కు సంబంధించి వెసులుబాటు కల్పించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రతి కుటుంబానికి బీమా.. అందరికీ ధీమా
నీటి పొదుపుపై పాఠశాలల్లో పాఠాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News