అక్వాన్ తుపాను దూకుడు.. రేపు గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే ఛాన్స్
ABN , Publish Date - Nov 19 , 2026 | 11:45 AM
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాను కొనసాగుతోంది. ఈ తుపాను గడిచిన ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అమరావతి, నవంబర్ 19: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపాను కొనసాగుతోంది. ఈ తుపాను గడిచిన ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 420 కిలోమీటర్లు, కళింగపట్నానికి 400 కిలో మీటర్లు, గోపాల్‌పూర్‌కి 490 కిలోమీటర్లు, పూరీకి 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను రేపు (నవంబర్ 20) మధ్యాహ్నానికి నరసాపురం- పూరీ మధ్య గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. అలాగే తీరం వెంబడి గంటకు 60-70 కిలో మీటర్లు, గరిష్ఠంగా 80 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ప్రఖర్ జైన్ సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి...
పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి
ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుపాను.. 24 నుంచి 36 గంటలు అప్రమత్తం
Read latest AP News And Telugu News