Share News

టెస్టుల్లో బుమ్రా అరుదైన ఘనత.. జవగళ్ శ్రీనాథ్ రికార్డు బద్దలు

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:11 PM

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో టాప్‌-10లోకి దూసుకొచ్చాడు.

టెస్టుల్లో బుమ్రా అరుదైన ఘనత.. జవగళ్ శ్రీనాథ్ రికార్డు బద్దలు
Jasprit Bumrah

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ రికార్డును అధిగమించాడు. దీంతో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పదో స్థానానికి చేరుకున్నాడు.


భారత్ తరఫున టెస్టు్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే(619 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో రవిచంద్రన్ అశ్విన్(537 వికెట్లు), కపిల్ దేవ్(434 వికెట్లు), హర్భజన్ సింగ్(417 వికెట్లు), ఇషాంత్ శర్మ(311 వికెట్లు), జహీర్ ఖాన్(311 వికెట్లు), రవీంద్ర జడేజా(323 వికెట్లు), బిషన్ సింగ్ బేడీ(266 వికెట్లు), భగవత్ చంద్రశేఖర్(242 వికెట్లు) ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రా (237 వికెట్లు) పదో స్థానానికి దూసుకొచ్చాడు.


ఇదిలా ఉంటే, భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది. నికోల్స్(113*), గ్లెన్ ఫిలిప్స్(94*) క్రీజులో ఉన్నారు. కాగా తొలి రోజు బుమ్రా 3 వికెట్లు పడగొట్టాగా.. ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్ తలొక వికెట్ చొప్పున తీశారు.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో టెస్టు మ్యాచ్: ముగిసిన తొలి రోజు ఆట.. కివీస్ స్కోర్ 243/5

టెన్నిస్ ఛాంపియన్‌షిప్ విజేతగా లారా దత్తా కుమార్తె..

Updated Date - Nov 19 , 2026 | 12:19 PM