వివాదంలో మాగ్నస్ కార్ల్‌సన్.. అగ్రస్థానంపై ప్రభావం పడుతుందా?
ABN , Publish Date - Nov 19 , 2026 | 08:59 AM
ప్రపంచ నంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. టోటల్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టూర్ పైలట్ టోర్నీలో కజికిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ బిబిసారా అసౌబాయేవాతోతో జరగాల్సిన మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచ నంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. టోటల్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టూర్ పైలట్ టోర్నీలో కజికిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ బిబిసారా అసౌబాయేవాతోతో జరగాల్సిన మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నాడు. అదీనూ ప్రత్యర్థికి చెప్పకుండా అక్కడ నుంచి వెళ్లిపోవడంతో వివాదం తలెత్తింది. మరోవైపు బిబిసారా మాత్రం కాసేపు కార్ల్‌సన్ కోసం వేచి చూస్తూ ఉండిపోయారు. తాను వెళ్తున్నట్లు ఆర్బిటర్‌తో కార్ల్‌సన్ చెప్పినా.. ఆ విషయం బిబిసారకు తెలియజేయకపోవడంతో నిర్వాహకులపై విమర్శలు మొదలయ్యాయి.
మరోవైపు ఈ టోర్నీలో కార్ల్‌సన్ రేటింగ్ కూడా ఒత్తిడిలో ఉంది. ఫాస్ట్ క్లాసిక్ గేమ్‌లో డ్రా చేసుకున్నా లేదా ఓడిపోయినా అతడి రేటింగ్ 2800 కంటే దిగువకు పడిపోయే పరిస్థితి ఉండేది. 2009 నుంచి దాదాపు 17 ఏళ్లుగా 2800 మార్కును దాటిన రేటింగ్‌ను కొనసాగిస్తున్న కార్ల్‌సన్‌కు ఇది కీలక అంశంగా మారింది. అయితే టోటల్ చెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అర్ధంతరంగా నిష్క్రమించడంతో పాటు.. ఫాస్ట్ క్లాసిక్ ఫార్మాట్‌లో కార్ల్‌సన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మొత్తం 10 గేమ్స్‌లో తొమ్మిదింటిని డ్రా చేసుకోగా, ఆర్మేనియాకు చెందిన హైక్ మార్టిరోస్యన్ చేతిలో ఓటమి చవిచూశాడు. దీంతో తన గ్రూపులో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గత వారం రోజుల్లో అతడి రేటింగ్ 21.8 పాయింట్లు తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే 15 ఏళ్లకు పైగా కొనసాగిస్తున్న ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకును కూడా కోల్పోయే ప్రమాదం ఉందని అతడి అభిమానులు ఆందోళన చెందారు. కానీ ఫిడే ఇప్పుడీ పైలట్ టోర్నీ పాయింట్లను పరిగణనలోకి తీసుకోకపోవడతో కార్ల్‌సన్ అగ్రస్థానంపై ప్రభావం చూపించలేదు. దీంతో టోర్నీ నిర్వాహకులతో పాటు కార్ల్‌సన్ తీరుపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
వెల్ ప్లెయిడ్ ఎంఎస్.. ధోనీ ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై సచిన్ స్పెషల్ పోస్ట్!
తొలి టెస్టు: చెలరేగుతున్న భారత బౌలర్లు.. కివీస్ స్కోర్ 66/4