భారత్‌తో టెస్టు మ్యాచ్: తొలి రోజు ముగిసిన ఆట.. కివీస్ స్కోర్ 243/5
ABN , Publish Date - Nov 19 , 2026 | 11:12 AM
వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 243 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్(113*) అజేయ సెంచరీ చేశాడు. మరో బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్(94*) సెంచరీకి చేరువలో ఉన్నాడు.
మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే భారత బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. టామ్ లాథమ్(0), కాన్వే(4), రచిన్ రవీంద్ర(15), డారిల్ మిచెల్(1), బ్లండెల్(5) స్వల్ప పరుగులకే ఔటయ్యారు. కాగా తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు తీసి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. ఆ తర్వాత రెండు సెషన్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగింది. స్వల్ప స్కోరుకే 5 వికెట్లు కోల్పోయిన కివీస్ జట్టును.. నికోల్స్, ఫిలిప్స్ గాడిలో పెట్టారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 173 పరుగుల భాగస్వామ్యా్న్ని నెలకొల్పారు. దీంతో తొలిరోజు కివీస్ పైచేయి సాధించింది. భారత బౌలర్లు బుమ్రా 3, అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్ చెరో వికెట్ తీశారు.
ఇవి కూడా చదవండి:
వెల్ ప్లెయిడ్ ఎంఎస్.. ధోనీ ఐపీఎల్ రిటైర్‌మెంట్‌పై సచిన్ స్పెషల్ పోస్ట్!
తొలి టెస్టు: చెలరేగుతున్న భారత బౌలర్లు.. కివీస్ స్కోర్ 66/4