పెద్దపల్లి జిల్లాలో యువకుల వీరంగం.. అర్థరాత్రి కత్తులతో దాడి చేసి యువకుడి హత్య
ABN , Publish Date - Nov 23 , 2026 | 06:25 AM
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి కత్తులతో వీరంగం సృష్టించిన గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని పొడిచి చంపారు.
పెద్దపల్లి జిల్లా, నవంబరు 23: జిల్లాలోని సింగరేణి ప్రాంతమైన గోదావరిఖనిలో దారుణం చోటుచేసుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి కత్తులతో దాడి చేసి ఓ వ్యక్తిని హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.
జిల్లాలోని గోదావరిఖనిలో కొందరు యువకులు కత్తులతో అర్థరాత్రి వీరంగం సృష్టించారు. అట్ల రాజశేఖర్ అనే యువకుడిపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించి.. ఆధారాలను సేకరించారు. మృతుడు సింగరేణి సంస్థలో పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడి పూర్తి వివరాలు, హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం
ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News