Share News

వడలో బొద్దింక..

ABN , Publish Date - Jul 30 , 2026 | 01:45 PM

జగిత్యాల పట్టణంలోని ఓ టిఫిన్‌ సెంటర్‌లో వడలో బొద్దింక వచ్చిన ఘటన కలకలం రేపింది.

 వడలో బొద్దింక..
Cockroach, Vada

జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ఓ టిఫిన్‌ సెంటర్‌లో వడలో బొద్దింక వచ్చిన ఘటన కలకలం రేపింది. పట్టణానికి చెందిన బండి వంశీ అనే వ్యక్తి శ్రీనివాస్‌ థియేటర్‌ ఎదురుగా ఉన్న దోసె సెంటర్‌లో వడ పార్సిల్‌ తీసుకొని వెళ్లాడు. ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి తింటుండగా ఒక వడలో బొద్దింక కనిపించింది.


jmt1.jpgఒక్కసారిగా షాక్‌కు గురైన వంశీ పార్సిల్‌తో దోసె సెంటర్‌కు వచ్చి ప్రశ్నించాడు. ఆ సమయంలో యజమాని లేకపోగా, సెంటర్‌ యజమాని అరుణ్‏కు ఫోన్‌ చేస్తే స్పందించడం లేదని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న టిఫిన్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయమై ఆహార తనిఖీ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆగస్టులో వరంగల్‌ మీదుగా ప్రత్యేక రైళ్లు

భారీ భవనాల్లో ఈవీ చార్జింగ్‌ యూనిట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 01:45 PM