Share News

ఆగస్టులో వరంగల్‌ మీదుగా ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:13 PM

ఆగస్టు నెలలో వరంగల్‌ మీదుగా కాన్పూర్‌-మధురై ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

ఆగస్టులో వరంగల్‌ మీదుగా ప్రత్యేక రైళ్లు
Kanpur Madurai special train

వరంగల్: ఆగస్టు నెలలో వరంగల్‌ మీదుగా కాన్పూర్‌-మధురై ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. కాన్పూర్‌ సెంట్రల్‌- మధురై ప్రత్యేక రైళ్లు (01925) ఆగస్టు 5, 12, 19, 26 తేదీలలో (ప్రతీ బుధవారం) ఉదయం 8.10 గంటలకు కాన్పూర్‌ నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం 7.15 గంటలకు మధురై చేరుకుంటాయి. అదేవిధంగా మధురై- కాన్పూర్‌ సెంట్రల్‌ (01926) ప్రత్యేక రైళ్లు ఆగస్టు 8, 15, 22, 29 తేదీలల్లో (ప్రతీ శనివారం) తెల్లవారు జామున 2.30 గంటలకు కాన్పూర్‌ సెంట్రల్‌ నుంచి బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు మధురై చేరుకుంటాయి.


hnk2.2.jpgఇవి నాగ్‌పూర్‌, చంద్రాపూర్‌, బల్లార్ష, సిరిపూర్‌ కాగజ్‌నగర్‌, రామగుండం, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వేస్టేషన్‌లలో ఆగుతాయి. ఇందులో సెకండ్‌ ఎసీ, థర్డ్‌ ఎసీ, స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎ.శ్రీధర్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఔషధాల గని.. బోడ కాకరకాయ

భారీ భవనాల్లో ఈవీ చార్జింగ్‌ యూనిట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 12:13 PM