Share News

8 ఏళ్ల బాలుడి ఏఐ టాలెంట్‌

ABN , Publish Date - Jul 30 , 2026 | 11:51 AM

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), వాయిస్‌ అసిస్టెంట్లు మధ్య పెరిగే జెన్‌ అల్ఫాతరం టాలెంట్‌కు అసలైన ప్రతిరూపం ఆ బాలుడు.

8 ఏళ్ల బాలుడి ఏఐ టాలెంట్‌
8 year old AI innovator

  • కథలు చెప్పే కొత్త ఏఐ పరికరం ఆవిష్కరణ

  • వాయిస్‌ కమాండ్‌తో కొత్తవి రాసి, వినిపించి, యానిమేషన్‌ చిత్రాలతో చూపేలా అభివృద్ధి

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), వాయిస్‌ అసిస్టెంట్లు మధ్య పెరిగే జెన్‌ అల్ఫాతరం టాలెంట్‌కు అసలైన ప్రతిరూపం ఆ బాలుడు. ఎలక్ట్రానిక్‌ పరికరాలతోనో, బొమ్మలతోనే ఆడుకునే వయసులో తానే ఏఐతో సరికొత్త పరికరాలను ఆవిష్కరిస్తూ టెక్‌ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు. 8 ఏళ్ల వయసులోనే హైదరాబాద్‌కు చెందిన లక్ష్‌వీర్‌రావు అనే బాలుడు ఏఐతో కొత్త కథలు రాసి, వినిపించి, చిత్రాలతో చూపించే ఓ అద్భుతమైన పరికరాన్ని అతి తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేశాడు.


city6.jpgఇంటర్నెట్‌ అవసరం లేని, పూర్తిగా ఆఫ్‌లైన్‌లో వినియోగించుకునే ఆ వాయిస్‌ కంట్రోల్డ్‌ ఏఐ స్టోరీ టెల్లింగ్‌ పరికరాన్ని కేవలం రూ. 760 విలువైన మైక్రోకంట్రోలర్‌తో తయారు చేశాడు. తన తండ్రి కెప్టెన్‌ వెంకట్‌ సహకారంతో స్థాపించిన ప్రాజెక్ట్స్‌ బైలక్ష్‌ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ఆ బాలుడు.. ఈఎ్‌సపీ32-ఎస్‌3 మైక్రో కంట్రోలర్‌, ఐఎన్‌ఎంపీ441 మైక్రోఫోన్‌, ఐ2ఎస్‌ స్పీకర్‌, మ్యాక్స్‌98357ఏ యాంప్లిఫయర్‌ వినియోగించి ఆ కథలు చెప్పే పరికరాన్ని సృష్టించాడు.


ప్రస్తుతానికి ఆన్‌లైన్‌ ద్వారా చదువుకుంటూ ఇలాంటి ప్రాజెక్టులను తయారు చేస్తున్నాడు. ఓపెన్‌ సోర్స్‌ ఏఐ మోడల్స్‌ను, తక్కువ ధరకు లభించే హార్డ్‌వేర్‌ను అనుసంధానించడానికి ఏఐ అప్లికేషన్స్‌ను ఎలా అభివృద్ధి చేయవచ్చో ఆ బాలుడి ప్రాజెక్టు నిరూపించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఔషధాల గని.. బోడ కాకరకాయ

భారీ భవనాల్లో ఈవీ చార్జింగ్‌ యూనిట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 12:33 PM