Share News

దొరకని పేడ.. కెమికల్స్ పీడ..

ABN , Publish Date - Jul 30 , 2026 | 11:16 AM

ఒకప్పుడు వాకిళ్లలోతెల్లవారుజామున అలుకు(కల్లాపి) చల్లి ముగ్గులు వేయడం నిత్యకృత్యంగా కని పించేది.

దొరకని పేడ.. కెమికల్స్ పీడ..
TG News, Warangal

  • వాకిళ్లలో కెమికల్స్‌ రంగులను అలుకుతున్న మహిళలు

  • రూ.10 నుంచి రూ.15కే లభిస్తున్న పౌడర్లు

  • సులభంగా ఉండటంతో విష రసాయనాల వైపు మొగ్గు

  • చర్మ, శ్వాసకోశ వ్యాధులు వస్తాయంటున్న వైద్యులు

వరంగల్‌: ఒకప్పుడు వాకిళ్లలోతెల్లవారుజామున అలుకు(కల్లాపి) చల్లి ముగ్గులు వేయడం నిత్యకృత్యంగా కని పించేది. ప్రస్తుతం పశువుల పేడ దొరకడం కాస్త కష్టంగా మారింది. అయితే ఇందుకు ప్రత్యామ్నాయంగా కెమికల్‌ (పేడ కలర్‌) పౌడర్లు, లిక్విడ్‌, రంగులను వినియోగించేం దుకు మహిళలు అమితాసక్తిని చూపిస్తు న్నారు. రూ.10నుంచి రూ.15కే లభించే సాంపి ఫైడర్‌, ఫ్లోర్‌ రంగోళి లిక్విడ్‌, ఇన్‌స్టంగ్‌ ముగ్గు, వాటర్‌ పౌడర్‌ను నిటితో కలిపి వారానికి రెండు, మూడు సార్లు వాకిట్లో చల్లడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక పండుగ సమయాల్లో చూస్తే ప్రతీ గడప ముందు కెమికల్‌తో కూడిన పేడ రంగులు వేస్తున్నారు. అయితే విషపూరిత మైన కృత్రిమ పేడ కలర్‌ వినియోగించడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు పర్యావ రణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైధ్యులు, పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


అగ్గువకు పేడ రంగులు

పేడ రంగులపై ఆసక్తి చూపిస్తున్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని మార్కెట్‌లో వ్యాపారులు సాంపి పౌడర్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. స్థానిక చిన్నపాటి కిరాణ షాపులతోపాటు ఆన్‌లైన్‌లో రూ.10నుంచి రూ.15కే పేడ కలర్‌ ప్యాకెట్లు లభిస్తున్నా యి. దీంతో మఽధ్యతరగతి మహిళలు పేడ రంగులను ఎక్కువగా వాడేందుకు మొగ్గు చూపిస్తున్నారు.


చర్మ, శ్వాసకోశ వ్యాధులు

పేడకుప్రత్యామ్నాయంగా ఉపయోగించే రంగుల్లో వస్త్రపరిశ్రమలో ఉపయోగించే యాసిడ్‌ గ్రీన్‌, రోడమైన్‌ బి వంటి సింఽథటిక్‌ కలర్స్‌, కెమికల్స్‌ కలిపిన సుద్దపొడి జింక్‌ ఆక్సైడ్‌, లిక్విడ్‌ కెమికల్‌ కలర్స్‌, బట్టలు మెరిసేలా కనిపించేందుకు కొన్నిచోట్ల మెటాలిక్‌ పౌడర్లను కలుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ రంగులకు ఉపయోగించే కెమికల్స్‌ ను ప్రస్తుతం పేడ కలర్స్‌తో కలుపుతున్న ట్టు తెలుస్తోంది. వీటి తయారీపై నియంత్ర ణ లేకపోవడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


hnk1.2.jpgఈ కెమికల్స్‌ను తరు చుగా చేతులతో ఉపయోగించడం వల్ల చర్మ, శ్వాసకోశ వ్యాధులతో పాటు ఊపిరితి త్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా కాంటాక్ట్‌ డెర్మటైటీస్‌, చర్మం ఎర్రబడడం, దురద, మంట, ఎలర్జీలు, చర్మం పొరలు పొరలుగా ఊడిపోతుంది. ఇప్పటికే సోరి యాసిస్‌ వంటి వ్యాధులతో బాధపడుతు న్న వారిలో ఈ ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది. కొందరిలో గోళ్ల బలహీనత, గోళ్ల చుట్టూ ఇన్‌ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.


శ్వాసకోశ సమస్యలు

పేడ రంగు నీళ్లు ఆరిపోయిన తర్వాత వాకిట్లో కెమికల్స్‌ కలిపిన సూక్ష్మధూళి గాలిలోకి చేరుతుం ది. ఆ కణాలు శ్వాసద్వారా శరీరంలోకి వెళ్లడం వల్ల ఆస్తమా, ఎలర్జిటిక్స్‌, బ్రాంకైటీస్‌ వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారి ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు సూ చిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడే వారికి ఇలాంటి పేడ కలర్స్‌ కెమికల్స్‌ ఎక్కువగా ప్రభా వం చూపేప్రమాదం ఉంది. ఈ పౌడర్లు కళ్లలోకి చేరితే మంట, కళ్లు ఎర్రబడడం, నీరు కారడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.నాణ్యత లేని రం గుల్లో హానికరమైన లోహాలు లేదా ఇతర రసా యనాలు ఉంటే దీర్ఘకాలికంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి

వరంగల్‌ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పేడ లభించని పరిస్థితుల్లో కెమికల్స్‌ వాడొద్దని, వీలైనంత వరకు సహజసిద్ధమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పసుపు కలిపిన నీరు, వేపాకుల కషాయం, ఇతర పర్యావరణహిత ద్రవణాలు లేదా సహజ పదార్థాలతో తయారు చేసిన బయో డిగ్రైడెబుల్‌ రంగులను వినియోగించడం మంచిది. దీంతో ఆరోగ్య, పర్యావరణ ముప్పు నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


చర్మ సమస్యలు వస్తాయి..

  • డాక్టర్‌ శ్రీకాంత్‌ సాతు, చర్మ వ్యాధి నిపుణులు

నేటి తరం వాడుతున్న రసాయనాల పేడ వల్ల అలర్జిక్‌ కాంట్రాక్ట్‌ డెర్మటైటిస్‌ అనే చర్మ సంబంఽ దమైన వ్యాధి ఎక్కువ అవుతుంది. ఈ రసాయ నాల పేడ చల్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే గాలి ద్వారా కూడా చల్లే వారితోపాటు దగ్గరలో ఉన్న వారికి కూడా అంటూ సోకే ప్రమాదం ఉంది. చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పేడను వాడేటప్పుడు చేతులకు గ్లౌస్‌లు విధిగా వాడాలి. లేదంటే కొబ్బరినూనె, మాశ్చరైజర్లు, చేతి వేళ్ల మొదలుకొని మోచేతి పైభాగం వరకు రాసుకోవాలి.


ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం

  • డాక్టర్‌ కె.మనోహర్‌రెడ్డి, శ్వాసకోశ వ్యాధి నిపుణుడు

రసాయనాల పేడ వాడకం వల్ల చెస్ట్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది దగ్గుతో మొదలై ఆయాసం, అలర్జీ, బ్రాంకైటీస్‌ వరకు దారితీస్తుంది. ఇది కొనసాగితే దీర్ఘకాలిక శ్వాస సంబంధిత రోగాలతోపాటు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది. కెమిక ల్‌ పడనివారు, హైపర్‌ సెన్సిటివిటీ ఉన్నవారు రసాయనాల పేడ వాడకానికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఔషధాల గని.. బోడ కాకరకాయ

భారీ భవనాల్లో ఈవీ చార్జింగ్‌ యూనిట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 11:21 AM