Share News

బాంకీపూర్ ఉపఎన్నికకు ముందు హైడ్రామా.. పోలీసులపై ప్రశాంత్ కిశోర్ తీవ్ర ఆరోపణలు..

ABN , Publish Date - Jul 30 , 2026 | 10:44 AM

బిహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఉద్రిక్తత నెలకొంది. జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఈ ఉపఎన్నికలో తొలిసారి ప్రత్యక్షంగా పోటీ చేస్తున్న ప్రశాంత్ కిశోర్ స్థానిక పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.

బాంకీపూర్ ఉపఎన్నికకు ముందు హైడ్రామా.. పోలీసులపై ప్రశాంత్ కిశోర్ తీవ్ర ఆరోపణలు..
Prashant Kishor

బిహార్‌లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఉద్రిక్తత నెలకొంది. జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఈ ఉపఎన్నికలో తొలిసారి ప్రత్యక్షంగా పోటీ చేస్తున్న ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) స్థానిక పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. తన పార్టీకి చెందిన 16 మందికి పైగా కార్యకర్తలను బిహార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. ఈ చర్య అధికార బీజేపీ ఒత్తిడితోనే జరిగిందని ఆయన విమర్శించారు.


ప్రశాంత్ కిశోర్ తన అనుచరులతో కలిసి పట్నాలోని జక్కన్‌పూర్ పోలీస్ స్టేషన్ వద్ద రాత్రంతా నిరసన చేపట్టారు. అదుపులోకి తీసుకున్న కార్యకర్తలను ఎక్కడ ఉంచారో పోలీసులు చెప్పడం లేదని ఆయన ఆరోపించారు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారని, అధికారిక అరెస్ట్ నమోదు కూడా చేయలేదని తెలిపారు. పోలీస్ స్టేషన్ వెలుపల ప్రశాంత్ కిశోర్, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది (Bankipur bypoll).


స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) తమపై బెదిరింపులకు పాల్పడ్డారని కిశోర్ ఆరోపించారు (Bihar election 2026). తన కార్యకర్తలకు ఏదైనా జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బీజేపీ మాత్రం ఈ ఆరోపణలపై అధికారికంగా స్పందించలేదు. కాగా, బాంకీపూర్ ఉపఎన్నిక అధికార బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నవీన్ రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో ఈ ఉపఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.


ఇవి కూడా చదవండి..

పసిడి ధరలు మరింత తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..


ఫ్రాన్స్‌ను కలవరపెడుతున్న కార్చిచ్చు.. అణు కేంద్రాల వైపు దూసుకొస్తున్న మంటలు..

Updated Date - Jul 30 , 2026 | 10:44 AM