మూత్రాశయంలో 40 రాళ్లు
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:47 PM
మూత్రాశయంలో ఏర్పడిన 40 రాళ్లను ఆపరేషన్ చేసి తొలగించిన ఘటన జనగామలో చోటుచేసుకుంది.
ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు
జనగామ: మూత్రాశయంలో ఏర్పడిన 40 రాళ్లను ఆపరేషన్ చేసి తొలగించిన ఘటన జనగామలో చోటుచేసుకుంది. దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు ఆర్.సోమనర్సయ్య మూత్రంలో రక్తస్రావం సమస్యతో ఈనెల 27న జనగామలోని ఆయుష్మాన్ హాస్పిటల్‌లో చేరాడు. పరీక్షల అనంతరం అతడి మూత్రాశయంలో రాళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది.
బుధవారం డాక్టర్ మాచర్ల భిక్షపతి ఆధ్వర్యంలో యూరాలజిస్టు డాక్టర్ కిరణ్ సహకారంతో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించి 40రాళ్లను తొలగించారు. ఆపరేషన్ అనంతరం సోమనర్సయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జైన రమేష్ తెలిపాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆగస్టులో వరంగల్ మీదుగా ప్రత్యేక రైళ్లు
భారీ భవనాల్లో ఈవీ చార్జింగ్ యూనిట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News