Share News

‘నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు’.. జూబ్లీహిల్స్ సీఐపై బాధితురాలి ఆరోపణ

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:44 PM

జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి సీఐను జూబ్లీహిల్స్ డీసీపీ విచారించారు.

‘నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు’.. జూబ్లీహిల్స్ సీఐపై బాధితురాలి ఆరోపణ
Jubilee Hills CI Case

హైదరాబాద్, జులై 30: జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి సీఐను జూబ్లీహిల్స్ డీసీపీ విచారించారు. ఇక, తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. సీఐ శ్రీనివాసులు రెడ్డికి మద్దతుగా కొంతమంది పోలీస్ అధికారులే తనపై నెగిటివ్‌గా ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. మరోవైపు శ్రీనివాసులు రెడ్డికి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5లో ఉండే ప్రముఖ బిల్డర్ అత్యంత సన్నిహితుడని సమాచారం.


సీఐని అధికారులు సస్పెండ్ చేసిన తరువాత.. ఆయనకు సహాయ సహకారాలు అందిస్తున్నాడంటూ బిల్డర్ వ్యవహారంపై కూడా ఉన్నతాధికారులు దృష్టికి బాధితురాలు తీసుకెళ్లింది. శ్రీనివాసులు రెడ్డి బెదిరింపులతో లక్షల రూపాయల ఇచ్చానని.. వాటిని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని బాధిత మహిళ ఆరోపించింది. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఉన్నతాధికారులు ముందు కన్నీరు పెట్టుకుంది. సీఐ శ్రీనివాసులు రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. తెలంగాణ ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో

రెండు దఫాలుగా ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 01:03 PM