మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు: ఆదోని చిన్నారులతో లోకేశ్ ఫొటో
ABN , Publish Date - Jul 30 , 2026 | 11:54 AM
ఆదోని చిన్నారులు సహస్ర ఆద్య, జయ స్కందతో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫొటో దిగి వారి కోరికను తీర్చారు. ‘లోకేశ్ సర్ మిమ్మల్ని కలవాలి, మీతో ఫొటో దిగాలని ఉంది’ అంటూ ఆదోని చిన్నారుల వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది.
కర్నూలు, జులై 30: ఇచ్చిన మాట ప్రకారం ఆదోని చిన్నారుల కోరికను నెరవేర్చారు ఏపీ మంత్రి నారా లోకేశ్. చిన్నారులు సహస్ర ఆద్య, జయ స్కందను కలిసిన మంత్రి వారితో ఫొటో దిగారు. దీంతో చిన్నారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ‘లోకేశ్ సర్ మిమ్మల్ని కలవాలి, మీతో ఫొటో దిగాలని ఉంది’ అంటూ ఆదోని చిన్నారుల వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. వెంటనే ఈ వీడియోపై స్పందించిన మంత్రి.. ‘నేను కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను’ అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా చిన్నారు వీడియోను రీ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఆదోని పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్.. చెప్పిన మాట ప్రకారం చిన్నారులను కలిశారు. వారితో కలిసి ఫొటో దిగారు. దీంతో ఇద్దరు చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తమ అభిమాన నాయకుడితో ఫొటో దిగడం పట్ల చిన్నారులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
నల్లబడిన నూనెతో పానీపూరీలు.. అత్తాపూర్‌లో అక్రమ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ సీజ్
క్రెడిట్ చోరీకి పాల్పడాల్సిన అవసరం మాకు లేదు: పల్లా శ్రీనివాసరావు
Read Latest AP News And Telugu News