Share News

నల్లబడిన నూనెతో పానీపూరీలు.. అత్తాపూర్‌లో అక్రమ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ సీజ్

ABN , Publish Date - Jul 30 , 2026 | 09:43 AM

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఎలాంటి పేరు లేకుండా నడిపిస్తున్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. పానీపూరీలు, సమోసాలు తయారు చేసి వివిధ బండ్లకు బల్క్‌గా సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

నల్లబడిన నూనెతో పానీపూరీలు.. అత్తాపూర్‌లో అక్రమ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ సీజ్
Hyderabad Food Safety Raid

రాజేంద్రనగర్, జులై 30: నగరంలో మరోసారి ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వరుసగా తనిఖీలు నిర్వహిస్తూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా అత్తాపూర్‌లో ఎలాంటి పేరు లేకుండా నడిపిస్తున్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. పానీపూరీలు, సమోసాలు తయారు చేసి వివిధ బండ్లకు బల్క్‌గా సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఎలాంటి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(FSSAI) లైసెన్స్ లేకుండానే ఆహార విక్రయాలు చేస్తున్నట్లు వెల్లడైంది.


వంట కోసం ఉపయోగించిన నూనె పూర్తిగా నల్లగా మారిన తర్వాత కూడా అదే నూనెను మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే వంటగదిలో ఈగల బెడద, తీవ్ర అపరిశుభ్రత నెలకొనడంతో పాటు ఓపెన్ డ్రైనేజీ మధ్యలోనే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కిచెన్ పక్కనే చెత్త పేరుకుపోవడం, పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టకపోవడం వంటి తీవ్ర నిర్లక్ష్యాలు బయటపడ్డాయి. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు సుమారు 3 వేల పానీపూరీలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అదేవిధంగా 4 కిలోల సమోసాలు, 2 కిలోల వాడిన వంటనూనెను కూడా స్వాధీనం చేసుకుని పారవేశారు. ల్యాబ్ పరీక్షల కోసం ఆహార నమూనాలను అధికారులు సేకరించారు. నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఫుడ్ బిజినెస్ కార్యకలాపాలను నిలిపివేసి, ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్‌ను అధికారులు సీజ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

భోగాపురానికి దారేది?

డ్రగ్స్ రాకెట్‌ కేసులో ఉగాండాకు చెందిన లేడీడాన్ అరెస్టు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2026 | 09:58 AM