Share News

భోగాపురానికి దారేది?

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:46 AM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రెడీ అయ్యింది. ఇక ప్రారంభోత్సవమే తరువాయి. విశాఖ నగరంతోపాటు అటు ఉత్తరాంధ్ర, ఇటు విజయవాడ, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలకు భోగాపురం విమానాశ్రయం సేవలు అందించనుంది. ఆయా ప్రాంతాల నుంచి భోగాపురం చేరుకునే మార్గాలివి...

భోగాపురానికి దారేది?
Bhogapuram International Airport

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రెడీ అయ్యింది. ఇక ప్రారంభోత్సవమే తరువాయి. విశాఖ నగరంతోపాటు అటు ఉత్తరాంధ్ర, ఇటు విజయవాడ, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలకు భోగాపురం విమానాశ్రయం సేవలు అందించనుంది. ఆయా ప్రాంతాల నుంచి భోగాపురం చేరుకునే మార్గాలివి...


విజయవాడ వైపు నుంచి...

విజయవాడ వైపు నుంచి భోగాపురం వెళ్లే ప్రయాణికులు... విశాఖ నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరంలేదు. అనకాపల్లి వద్దే ఆనందపురం వైపు వెళ్లే రాష్ట్ర రహదారిలోకి మళ్లాలి. ఆనందపురం నుంచి ఎన్‌హెచ్‌-16 ద్వారా భోగాపురం చేరుకోవచ్చు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఇదే మార్గం!


ఉత్తరాంధ్ర నుంచి...

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు చెందినవారు భోగాపురం విమానాశ్రయానికి సులువుగా చేరుకోవచ్చు. విశాఖ నగరం కంటే ముందే విమానాశ్రయం వస్తుంది.

Updated Date - Jul 30 , 2026 | 08:51 AM