రెండు దఫాలుగా ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:28 PM
గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందని, పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జులై 30: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల మేర అప్పులు చేసిందని, పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు(గురువారం) జిల్లాలోని చండ్రుగొండ మండలం మంగయ్య బంజర గ్రామంలో 45 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్, లో - లెవల్ కాజ్‌వేను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు, రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. రెండో విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. దీంతో రెండు దఫాలుగా ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదవారికి మంజూరు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. మూడు, నాలుగో విడతలో ప్రతి ఒక్క అర్హుడైన పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కులం, మతం, పార్టీ అని చూడటం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్న ఈ ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
నల్లబడిన నూనెతో పానీపూరీలు.. అత్తాపూర్‌లో అక్రమ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ సీజ్
పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. తెలంగాణ ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో
Read Latest Telangana News And Telugu News