నీటి యుద్ధాలు రాకుండా ముందుగానే మేల్కొనాలి
ABN , Publish Date - Mar 24 , 2026 | 09:50 AM
మిడిల్ ఈస్ట్ దేశాల్లో చమురు కోసం జరుగుతున్న యుద్ధాల మాదిరిగానే.. భవిష్యత్తులో నీటికోసం యుద్ధాలను చూడబోయే కాలం మరెంతో దూరం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు.
హైడ్రా కమిషనర్ ఆవుల వెంకట రంగనాథ్
హైదరాబాద్ సిటీ: మిడిల్ ఈస్ట్ దేశాల్లో చమురు కోసం జరుగుతున్న యుద్ధాల మాదిరిగానే.. భవిష్యత్తులో నీటికోసం యుద్ధాలను చూడబోయే కాలం మరెంతో దూరం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. జలవనరుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నీటికొరతతో యుద్ధాల వరకూ వెళ్లకుండా ముందుగానే మేల్కొనాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జేఎన్‌టీయూలో.. ఓపెన్ జియోస్పేషియల్ కన్సార్టియం, ఇండియన్ సొసైటీ ఆఫ్ జియోమేటిక్స్ హైదరాబాద్ చాప్టర్ సంయుక్తంగా వర్క్‌షాప్ నిర్వహించాయి.
ముఖ్య అతిథిగా హాజరైన రంగనాథ్ మాట్లాడుతూ, హైదరాబాద్(Hyderabad)లో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నగరంలోని గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయించిందన్నారు. ఈ దిశగా హైడ్రా వడివడిగా ముందుకు వెళుతోందన్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డేటా ప్రకారం 1975 నుంచి 2025లోగా నగరంలో 60శాతం చెరువులు మాయమయ్యాయని.. మరో 15 ఏళ్లలో ప్రస్తుతం ఉన్నవి కూడా కనుమరుగయ్యే పరిస్థతి ఉందని తెలిపారు. హైడ్రా చర్యల వల్ల అందరికీ చెరువుల ఎప్‌టీఎల్, బఫర్ జోన్ అంటే తెలిసివచ్చిందని,
గతంలో మాదిరిగా రియల్టర్లు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ పరిధిలో ఇళ్లను నిర్మించడంలేదని తెలిపారు. చెరువులు, నాలాలను పరిరక్షించేందుకు జేఎన్‌టీయూ, ఎన్‌ఆర్‌ఎ్‌ససీ, సర్వే ఆఫ్ ఇండియా వంటి సంస్థల సహకారాన్ని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ వైస్ చాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి, సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ విభాగం ప్రొఫెసర్లు విజయలక్ష్మి, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు రికవరీకి ఛాన్స్?
భద్రాద్రి వివాదంపై నివేదిక లేకుండా ఏంచేస్తాం?
Read Latest Telangana News and National News