Share News

అమరావతిపై ఎవరు కుట్రలు చేసినా ఉపేక్షించేది లేదు: మంత్రి అనిత

ABN , Publish Date - Mar 24 , 2026 | 08:13 AM

రాజధాని అమరావతిపై ఎవరు కుట్రలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అమరావతిలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం.. అది కూడా ఒకే తరహాలో జరుగుతుండటంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

అమరావతిపై ఎవరు కుట్రలు చేసినా ఉపేక్షించేది లేదు: మంత్రి అనిత

అమరావతి, మార్చి 24: రాజధాని అమరావతిపై ఎవరు కుట్రలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అమరావతిలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం.. అది కూడా ఒకే తరహాలో జరుగుతుండటంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మంగళవారం రాజధాని అమరావతిలో మంత్రి అనిత విలేకర్లతో మాట్లాడుతూ.. అమరావతిలోని రాయపూడి సమీపంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద గత అర్థరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదాన్ని.. ఐదు అగ్నిమాపక శకటాలతో చాలా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.


అమరావతిలో ఇటీవల జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారన్నారు. ఆ రోజు సైతం జరిగిన అగ్నిప్రమాదం కూడా ఉద్దేశపూర్వకంగా జరిగిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. అమరావతి ప్రాంతంలో గత కొద్ది రోజులుగా వర్షం కురిసినందున ఈ తరహా ఘటనలు జరగటానికి అవకాశాలు చాలా స్వల్పమని మంత్రి అనిత అభిప్రాయపడ్డారు.


సోమవారం అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్లార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమకు భూమి పూజ ఘనంగా జరిగిందని.. దీన్ని చూసి ఓర్వలేక రాజధానిలో పైపులకు నిప్పు పెట్టారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయని మంత్రి అనిత సందేహం వ్యక్తం చేశారు. గతంలో రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఓర్వలేక అరటితోటకు నిప్పు పెట్టిన ఉదాహరణలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ ప్రమాదంపై పోలీసు శాఖ అన్ని కోణాల్లో విచారణ చేస్తోందని మంత్రి అనిత వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్న భువనమ్మ

ఈ చిన్న చిట్కాతో ఆర్థరైటిస్‌కు చెక్..

For More AP News And Telugu News

Updated Date - Mar 24 , 2026 | 09:15 AM