నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్న భువనమ్మ
ABN , Publish Date - Mar 24 , 2026 | 07:47 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
చిత్తూరు, మార్చి 24: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం సోమవారం రాత్రి కుప్పంలోని తమ నివాసానికి ఆమె చేరుకున్నారు. ఈ రోజు (మంగళవారం) ఉదయం కడపల్లి నివాసం వద్ద ప్రజల నుంచి అర్జీలను ఆమె స్వీకరించనున్నారు. అనంతరం మంకలదొడ్డి, సింగారపురం, మొట్లచేను, కూసూరు గ్రామాలకు చెందిన మహిళలతో సమావేశమవుతారు. పైపాల్యంలో విలువల బడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో నారా భువనేశ్వరి భేటీ అవుతారు.
25వ తేదీ బుధవారం ఉదయం అర్జీల స్వీకరణ తర్వాత కుప్పం డిగ్రీ కళాశాలల్లో జరిగే జాబ్ మేళాలో భువనేశ్వరి పాల్గొంటారు. ఆ తర్వాత పెద్దకోటమానుపల్లిలో మహిళా సదస్సులో పాల్గొనున్నారు. 26వ తేదీ గురువారం శాంతిపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. రామకుప్పంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి.. బల్ల గ్రామంలో మహిళలతో భువనేశ్వరి సమావేశం కానున్నారు.
ఇక ప్రమాదంలో మరణించిన ఐటీడీపీ కార్యకర్త రవి కుటుంబాన్ని పరామర్శిస్తారు. 27వ తేదీ శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా కుప్పంలోని రామాలయాన్ని భువనేశ్వరి సందర్శిస్తారు. ఆ తర్వాత స్థానిక టీటీడీ కళ్యాణమండపంలో జరిగే ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొంటారు. అనంతరం అమరావతిలోని తన నివాసానికి నారా భువనేశ్వరి తిరుగు ప్రయాణమవుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ చిన్న చిట్కాతో ఆర్థరైటిస్‌కు చెక్..
బందో‘మస్త్’..శ్రీరామ నవమి శోభాయాత్రకు 3వేల మంది పోలీసులు
For More AP News And Telugu News