ఈ చిన్న చిట్కాతో ఆర్థరైటిస్‌కు చెక్..
ABN , Publish Date - Mar 24 , 2026 | 07:15 AM
ప్రస్తుత పరిస్థితుల్లో అత్యధిక శాతం మంది కీళ్ల నొప్పులు (ఆర్థరైటిస్) సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యతో వైద్యుల వద్దకు వెళ్తే.. మందులు రాస్తున్నారు. వాటిని వాడితే.. ఆ సమయంలో మాత్రమే ఈ నొప్పులు తగ్గుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో అత్యధిక శాతం మంది కీళ్ల నొప్పులు (ఆర్థరైటిస్) సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యతో వైద్యుల వద్దకు వెళ్తే.. మందులు రాస్తున్నారు. వాటిని వాడితే.. ఆ సమయంలో మాత్రమే ఈ నొప్పులు తగ్గుతున్నాయి. ఆ తర్వాత మళ్లీ కీళ్ల నొప్పులు వస్తున్నాయి. అయితే ఈ ఆర్థరైటిస్ సమస్యకు గోధుమ కటోరా(గోండ్ కతీరా)తో చెక్ పెట్ట వచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని ఆస్ట్రాగాలస్ చెట్ల నుంచి సేకరిస్తారు. దీనిని వాడడం వల్ల వేసవిలో శరీరంలోని తాపాన్ని నియంత్రించడమే కాకుండా.. ఈ నొప్పులు సైతం తగ్గుతాయని అంటున్నారు. ఈ గోధుమ కటోరా వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు..
గోధుమ కటోరాలో అద్భుతమైన శీతలీకరణ గుణాలు ఉన్నాయి. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది.
దీనిపై ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగుల కదలికలను సులభతరం చేసి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తోంది.
ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అందులోని ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
గోధుమ కటోరా తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ముడతలను తగ్గిస్తుంది. చర్మాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది.
ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులు ఉన్న వారికి ఇది చాలా మంచిది. ఎముకలను బలోపేతం చేయడంలో.. నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది.
ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. తద్వారా అనవసరమైన ఆకలి తగ్గి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మహిళల్లో ప్రసవానంతరం బలహీనతను తగ్గించడంతోపాటు గర్భాశయ ఆరోగ్యానికి మంచిది.
అయితే ఈ గోధుమ కటోరాను నేరుగా తినకూడదు. దీనిని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. దీంతో అది జెల్లీలాగా మారుతుంది. దీనిని నీరు, పాలు, లస్సీ, షర్బత్, రోజ్ వాటర్ లేదా నిమ్మరసరం, సుగంధ సోడాతో కలిపి తీసుకోవాలి.
ముఖ్య సూచన..
ఈ గోధుమ కటోరా తీసుకునేటప్పుడు తగినంత నీరు తాగడం ముఖ్యం. లేకుంటే గొంతులో అడ్డం పడే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు
For More Health News And Telugu News