Share News

ట్రంప్‌తో చర్చల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 24 , 2026 | 08:26 AM

ఇరాన్ మీద జరుపుతున్న యుద్ధానికి ఐదు రోజుల పాటు విరామం ప్రకటిస్తున్నామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశారు.

ట్రంప్‌తో చర్చల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
Netanyahu Trump talks

ఆంధ్రజ్యోతి, మార్చి 24: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తాను మాట్లాడానని, పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అమెరికా అధ్యక్షుడితో జరిపిన చర్చల సారాంశాన్ని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా వివరించారు.

ఇజ్రాయెల్ సైన్యం (IDF), అమెరికా సైన్యం సాధించిన అద్భుతమైన విజయాలను ప్రాతిపదికగా తీసుకుని, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు భంగం కలగకుండా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని ట్రంప్ చెప్పారని నెతన్యాహు వెల్లడించారు. ఒకవైపు శాంతి చర్చల ప్రస్తావన వస్తున్నా.. అటు ఇరాన్ లోనూ, ఇటు లెబనాన్‌లోనూ ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతాయని కూడా నెతన్యాహు స్పష్టం చేశారు.


ఇరాన్ క్షిపణి, అణు కార్యక్రమాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నామని, అలాగే హిజ్బుల్లాపై బలమైన దాడులు కొనసాగిస్తున్నామని నెతన్యాహు చెప్పారు. గత కొన్ని రోజుల్లోనే ఇద్దరు ఇరాన్ అణు శాస్త్రవేత్తలను ఖతం చేశామని, తమ కీలక ప్రయోజనాల రక్షణ కోసం ఎంతటి చర్యకైనా వెనకాడబోమని నెతన్యాహు హెచ్చరించారు.

Updated Date - Mar 24 , 2026 | 09:02 AM