Share News

ఆన్‌లైన్‌లో రూ.2.9 లక్షల గ్రాఫిక్ కార్డు ఆర్డరిస్తే.. డిటర్జెంట్ డెలివరీ! నెట్టింట పోస్టు వైరల్

ABN , Publish Date - Mar 24 , 2026 | 09:05 AM

ఆన్‌లైన్‌లో గ్రాఫిక్ కార్డు ఆర్డర్ ఇస్తే డిటర్జెంట్ పౌడర్ డెలివరీ అయ్యిందంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ అంశంపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

ఆన్‌లైన్‌లో రూ.2.9 లక్షల గ్రాఫిక్ కార్డు ఆర్డరిస్తే.. డిటర్జెంట్ డెలివరీ! నెట్టింట పోస్టు వైరల్
Online Delivery Fraud Incident

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్ గ్రాఫిక్ కార్డు ఆర్డర్ ఇస్తే డిటర్జెంట్ పౌడర్ డెలివరీ అయ్యిందంటూ ఓ యూజర్ నెట్టింట పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. స్వాగత్ నాయక్ అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఈ పోస్టును పెట్టారు.

తమ స్టార్టప్ సంస్థ కోసం ఆన్‌లైన్‌లో రూ.2.9 లక్షల గీగాబైట్ ఆర్‌టీఎక్స్ 5090 గ్రాఫిక్ కార్డు ఆర్డర్ చేశానని స్వాగత్ తెలిపారు. కానీ గ్రాఫిక్ కార్డుకు బదులు 1 కేజీ ఘడీ డిటర్జెంట్ పౌడర్ డెలివరీ అయ్యిందని అన్నారు. ‘గ్రాఫిక్ కార్డు బరువు సుమారు 3 కేజీలు ఉంటుంది. వారు డెలివరీ చేసిన ప్యాకేజీ లేబుల్‌పై 1.56 కేజీలని స్పష్టంగా కనిపిస్తోంది. తనిఖీల్లో ఈ విషయం ఎందుకు బయటపడలేదు?’ అని ప్రశ్నించారు. మాన్యుఫ్యాక్చరర్ సీల్ కూడా తొలగించి మళ్లీ వేసినట్టు తనకు కనిపించిందని చెప్పారు. తప్పుడు బార్ కోడ్‌ను ప్యాకేజీపై అంటించారని అన్నారు. ఈ విషయంలో తాను ఫిర్యాదు చేసినా ఆశించిన స్పందన కరువైందని అన్నారు.


ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తామూ ఇలాంటి అనుభవాలను ఎదుర్కున్నామని పలువురు కామెంట్ చేశారు. అంతటి విలువైన వస్తువు ప్యాకేజీనీ అన్‌బాక్స్ చేసేటప్పుడు రికార్డు చేసుకోవాలని మరికొందరు సూచించారు. ఇలాంటి సమయాల్లో అవే అక్కరకు వస్తాయని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

విద్యార్థిని చితకబాదిన టీచర్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మీ కళ్లను పరీక్షించుకోండి.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 19 సెకెన్లలో కనిపెట్టండి


Updated Date - Mar 24 , 2026 | 09:35 AM