గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు రికవరీకి ఛాన్స్?
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:55 AM
యుద్ధ భయాలు, యూఎస్ బాండ్స్‌పై రాబడులు పెరగడం తదితర కారణాలతో లోహాల ధరలు భారీ కుదుపులకు లోనవుతున్నాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతల దెబ్బకు బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా తిరోగమనంలో పయనిస్తున్నాయి. యుద్ధ భయాలు పతాకస్థాయికి చేరడం, యూఎస్ బాండ్స్‌పై రాబడులు పెరగడంతో నిన్న లోహాల ధరలు భారీ పతనాన్ని చవిచూశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మార్చి 24) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి స్పాట్ ధర రూ.1,35,640కు పడిపోయింది. 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,24,340కు చేరింది. నగరంలో వెండి ధర కూడా రికార్డు స్థాయి పతనాన్ని చవిచూసింది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,29,900గా ఉంది.
నిన్న (మార్చి 23) భారత్‌లో లోహాల ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పతనమైన విషయం తెలిసిందే. మేలిమి బంగారం ధర రూ.10,320ల మేర పతనం కాగా వెండి ధరలో రూ.20 వేల మేర కోత పడింది. అయితే, యుద్ధానికి ఐదు రోజుల విరామం ఇస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్స్ శాంతించాయి. యుద్ధ భయాలు కాస్త తగ్గాయి. ముడి చమురు ధర 100 డాలర్ల దిగువకు చేరింది. అయితే, డాలర్ ప్రస్తుతం బలపడటం, యూఎస్ బాండ్స్‌పై రాబడులు అధికంగా ఉండటంతో పసిడి, వెండిలపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. స్వల్పకాలిక పెరుగుదలను కూడా కొట్టిపారేయలేమని కామెంట్ చేస్తున్నారు.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి (24 క్యారెట్, 22 క్యారెట్) ధరలు ఇవీ
చెన్నై: ₹1,39,190; ₹1,27,590;
ముంబై: ₹1,35,640; ₹1,24,340;
న్యూఢిల్లీ: ₹1,35,790; ₹1,24,490;
కోల్‌కతా: ₹1,35,640; ₹1,24,340;
బెంగళూరు: ₹1,35,640; ₹1,24,340;
హైదరాబాద్: ₹1,35,640; ₹1,24,340;
విజయవాడ: ₹1,35,640; ₹1,24,340;
కేరళ: ₹1,35,640; ₹1,24,340;
పుణె: ₹1,35,640; ₹1,24,340;
వడోదరా: ₹1,35,690; ₹1,24,390;
అహ్మదాబాద్: ₹1,35,690; ₹1,24,390;
వెండి (కిలో) ధరలు ఇలా
చెన్నై: ₹2,34,900;
ముంబై: ₹2,29,900;
న్యూఢిల్లీ: ₹2,29,900;
కోల్‌కతా: ₹2,29,900;
బెంగళూరు: ₹2,29,900;
హైదరాబాద్: ₹2,29,900;
విజయవాడ: ₹2,29,900;
కేరళ: ₹2,29,900;
పుణె: ₹2,29,900;
వడోదరా: ₹2,29,900;
అహ్మదాబాద్: ₹2,29,900;
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలూ చదవండి:
రూ.48 లక్షల కోట్లు.. పశ్చిమాసియా సంక్షోభంలో ఆవిరైన సంపద
యుద్ధ విరామం.. భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధర