100 డాలర్ల దిగువకు క్రూడ్‌ఇవి కూడా చదవండి పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే.. మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:55 AM
ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇతర ఇంధన మౌలిక వసతులపైౖ దాడుల ప్రణాళికను 5 రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో...
యుద్ధ విరామంతో భారీగా తగ్గిన ధర
ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇతర ఇంధన మౌలిక వసతులపైౖ దాడుల ప్రణాళికను 5 రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ముడిచమురు ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడాయిల్ పీపా ధర ఒకదశలో 14.5% తగ్గి 96 డాలర్లకు జారుకుంది. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 9 గంటల సమయానికి 12ు నష్టంతో 98.88 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
చమురు తగ్గే.. వాల్‌స్ట్రీట్ మురిసే..
చమురు ధరలు 100 డాలర్ల దిగువకు జారుకోవడం ఈక్విటీ మార్కెట్లకు భారీ ఊరట కల్పించింది. అమెరికన్ స్టాక్ మార్కెట్లో డౌజోన్స్ సూచీ ఒకదశలో 922 పాయింట్లు పుంజుకోగా.. ఎస్ అండ్ పీ, నాస్‌డాక్ సూచీలు 1.90% వరకు బలపడ్డాయి. యూరోపియన్ సూచీలూ భారీ లాభాల్లో ముగిశాయి.
నేడు మన సూచీలూ బిగ్ జంప్
అమెరికా, యూరప్ మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో మన ఇంటర్నేషనల్ ఈక్విటీ సూచీ గిఫ్ట్ నిఫ్టీ సైతం ఒకదశలో 853 పాయింట్లు (3.80%) ఎగబాకింది. ఈ లెక్కన మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ కూడా భారీగా పుంజుకునే అవకాశాలున్నాయంటున్నారు.
ఇవి కూడా చదవండి
పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..
మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం