మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Mar 23 , 2026 | 07:18 PM
హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విజయనగర్ కాలనీలోని శ్రుతి మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో ఏసీ పేలడంతో మంటలు చెలరేగాయి.
హైదరాబాద్: మెహిదీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విజయనగర్ కాలనీలోని శ్రుతి మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఆస్పత్రిలో భద్రతా ప్రమాణాలపై కూడా అధికారులు పరిశీలన చేపట్టారు.
Also Read:
ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ తప్పులు చేయకండి
ఈ పండ్లు, కూరగాయలను కలిపి నిల్వ చేయకండి.. ఎందుకంటే
For More Latest News