Share News

ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ తప్పులు చేయకండి

ABN , Publish Date - Mar 23 , 2026 | 05:21 PM

ఇంట్లో శాంతి, సానుకూల వాతావరణం ఉండాలంటే మన రోజువారీ అలవాట్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేసే చిన్న తప్పులు కూడా ఇంటి శక్తి, వాతావరణంపై ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ తప్పులు చేయకండి
Vastu Tips For Home Entrance

ఇంటర్నెట్ డెస్క్: వాస్తు శాస్త్రం ప్రకారం మన చిన్న చిన్న అలవాట్లు కూడా ఇంటి వాతావరణంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు మన ప్రవర్తన, అలవాట్లు ఇంట్లో శాంతి, ఆనందంపై ప్రభావం చూపుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు.


బూట్లు ఎక్కడపడితే అక్కడ వేయడం

ఇంట్లోకి వచ్చే ముందు చెప్పులు, బూట్లు ఎక్కడపడితే అక్కడ వదిలేయడం వల్ల వాస్తు ప్రకారం ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది ఇంట్లో అశాంతికి, లక్ష్మీదేవి దూరమవడానికి కారణమవుతుంది. చెప్పులను ఎప్పుడూ ఒక పద్ధతిలో, షూ ర్యాక్‌లో ఉంచడం ఉత్తమం, ఇది ఇంట్లో సానుకూలతను పెంపొందిస్తుంది.

shoes.jpg

కోపం లేదా ఒత్తిడి

బయట నుంచి కోపం లేదా టెన్షన్‌తో ఇంట్లోకి రావడం మంచిది కాదు. ఇలా చేస్తే ఇంటి వాతావరణం కూడా ప్రభావితమవుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి.


చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోకుండా

బయట నుంచి వచ్చాక చేతులు, కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్లడం మంచిది కాదు. బయట తిరగడం వల్ల చేతులకు, కాళ్లకు సూక్ష్మక్రిములు, దుమ్ము చేరతాయి. వీటిని కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్తే ఆ క్రిములు ఇంట్లోకి ప్రవేశించి, అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది. అందువల్ల, ఇల్లు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలంటే బయట నుంచి వచ్చిన వెంటనే చేతులు, కాళ్లు కడుక్కోవడం మంచి అలవాటు.

వచ్చిన వెంటనే పడుకోవడం:

ఇంటికి రాగానే వెంటనే పడుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఫ్రెష్ అవ్వాలి, అవసరమైతే స్నానం చేసి తర్వాత విశ్రాంతి తీసుకోవాలి.

Sleep (7).jpg

తలుపు గట్టిగా మూయడం:

ఇంట్లోకి వచ్చేటప్పుడు తలుపును గట్టిగా మూయకూడదు. మెల్లగా మూయడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఇంట్లో సానుకూల వాతావరణం కొనసాగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం

పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి

For More Latest News

Updated Date - Mar 23 , 2026 | 06:21 PM