Vastu Tips: పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి.. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి..!
ABN , Publish Date - Jan 05 , 2026 | 10:52 AM
హిందూమతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యం ఉంది. చాలా మంది వాస్తు శాస్త్రం ప్రకారమే తమ ఇళ్లను నిర్మిస్తుంటారు. వాస్తు ప్రకారమే ఇంట్లో సామగ్రిని అమర్చుతారు. వాస్తు అనేక సమస్యలకు పరిష్కారాలను..
Vastu Tips for Money: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యం ఉంది. చాలా మంది వాస్తు శాస్త్రం ప్రకారమే తమ ఇళ్లను నిర్మిస్తుంటారు. వాస్తు ప్రకారమే ఇంట్లో సామగ్రిని అమర్చుతారు. వాస్తు అనేక సమస్యలకు పరిష్కారాలను అందిస్తుందని విశ్వసిస్తారు. సంపాదించిన డబ్బు నిలవకపోవడానికి కూడా వాస్తు దోషాలు ఒక కారణంగా చెబుతుంటారు. ఊహించని ఆర్థిక ఇబ్బందులు, పెరుగుతున్న అప్పులు వాస్తు లోపాల వల్ల సంభవిస్తాయని చెబుతుంటారు. ముఖ్యంగా ఇంట్లో డబ్బులు నిలవకపోవడానికి, అప్పులు పెరిగిపోవడానికి వాస్తుపరమైన కొన్ని తప్పులే కారణమని వాస్తు పండితులు చెబుతున్నారు. మరి ఆ చిన్న చిన్న వాస్తు దోషాలు ఏంటి? ఇంట్లో డబ్బులు నిలవకుండా చేసే ఆ వాస్తు దోషాలకు పరిహారాలు ఏంటి? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
ఆర్థిక సమస్యలు, అప్పులు, అనారోగ్య సమస్యలకు వాస్తు దోషాలు కారణం అవుతాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇంటి నిర్మాణం మొదలు.. ఇంట్లో సామగ్రి అమర్చే విధానం అంతా వాస్తు ప్రకారం జరిగితే ఎలాంటి సమస్యా ఉండదని.. వాస్తు ప్రకారం లేకపోతే పలు రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సాధారణంగా చాలా మంది ప్రజలు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటారు. ఇందుకు వాస్తు కూడా ఒక కారణమై ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. వాస్తు ప్రకారం ఇంట్లోని కొన్ని ప్రదేశాలలో డబ్బులు ఉంచకూడదట. ఒకవేళ ఇలా చేస్తే.. ఆర్థిక నష్టం జరుగుతుందని.. ఇంట్లో డబ్బు నిలవదని చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం.. టాయిలెట్, బాత్రూమ్ పక్కన గోడపై షెల్ఫ్‌లో డబ్బులను దాచిపెట్టకూడదు. అలాగే.. డబ్బులు భద్రపరిచే బీరువా గానీ, బాక్స్ గానీ ఒక మూలలో, చీకటి ప్రదేశంలో పెట్టకూడదు. ఇది వాస్తు శాస్త్రానికి విరుద్ధం. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో.. అక్కడ లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. ఆ ఇల్లు ఎల్లప్పుడూ లక్ష్మీ దేవితో కళకళలాడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం, ఆర్థిక శ్రేయస్సు కోసం వాస్తు పరిహారాలు పాటిస్తూ.. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు పండితులు.
Disclaimer: పైన పేర్కొన్న వివరాలు వాస్తు నిపుణులు అందించిన సమాచారం, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఫ్యాన్స్‌ను హెచ్చరించిన హిట్‌మ్యాన్.. ఎందుకంటే?
ఎస్‌జీహెచ్ సభ్యురాలుగా ప్రతీ మహిళ.. ఇదే మా సంకల్పం: మంత్రి సీతక్క
ఒత్తిడిలో ఐటీ రంగం.. సూచీలకు స్వల్ప నష్టాలు..