ఈ పండ్లు, కూరగాయలను కలిపి నిల్వ చేయకండి.. ఎందుకంటే
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:08 PM
మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలను ఒకేచోట నిల్వ చేయడం చాలా మంది చేసే సాధారణ తప్పు. కానీ ఇలా కలిపి ఉంచితే అవి త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: చాలామంది మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలను ఒకేచోట కలిపి ఉంచుతారు. కానీ ఇలా చేయడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి. పండ్లు, కూరగాయలను శుభ్రం చేసి ఒకేచోట ఉంచితే అవి త్వరగా కుళ్లిపోతాయి. కొన్ని పండ్లు ‘ఇథిలీన్’ అనే వాయువును విడుదల చేస్తాయి. ఈ వాయువు దగ్గరలో ఉన్న ఇతర పండ్లు, కూరగాయలు త్వరగా కుళ్లిపోవడానికి కారణమవుతుంది. అలాగే వాటి రుచి, పోషక విలువలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి వాటిని వేరువేరుగా నిల్వ చేయడం మంచిది. అందుకే ఏవి కలిపి పెట్టకూడదో తెలుసుకోవడం అవసరం.
కలిపి నిల్వ చేయకూడని పండ్లు, కూరగాయలు:
ఆపిల్ – ఆకుకూరలు: ఆపిల్ నుంచి ఇథిలీన్ వాయువు వస్తుంది. దాన్ని క్యాబేజీ, పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలతో ఉంచితే అవి త్వరగా పసుపు రంగులోకి మారి, రుచి తగ్గిపోతుంది.
బ్రోకలీ – టమాటా: టమాటాలో ఉండే వాయువు వల్ల బ్రోకలీ త్వరగా రంగు మారి, పోషకాలు తగ్గిపోతాయి.
బంగాళాదుంప – ఉల్లిపాయ: ఇవి రెండింటిని కలిపి ఉంచితే ఉల్లిపాయలోని తేమ, వాయువు వల్ల బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తి పాడవుతాయి.

టమాటా – దోసకాయ: టమాటా నుంచి వచ్చే వాయువు వల్ల దోసకాయ త్వరగా మెత్తబడిపోతుంది, రుచి కూడా తగ్గిపోతుంది.
ఆపిల్ – క్యారెట్: ఆపిల్ దగ్గర పెట్టిన క్యారెట్లు త్వరగా పాడైపోతాయి. కాబట్టి వీటిని వేర్వేరుగా ఫ్రిజ్‌లో ఉంచాలి.
అరటిపండ్లు ఎక్కువగా ఇథిలీన్ వాయువు విడుదల చేస్తాయి. మామిడి, బొప్పాయి, స్ట్రాబెర్రీ, ద్రాక్ష వంటి పండ్లతో ఉంచితే అవి త్వరగా పాడైపోతాయి.
ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
వాణిజ్య సిలిండర్ కొరత.. కుదేలవుతున్న ఫుడ్ ఇండస్ట్రీ
పేదలను వెళ్లగొట్టు.. ఒవైసీని కాపాడు
For More Latest News