పేదలను వెళ్లగొట్టు.. ఒవైసీని కాపాడు
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:49 AM
‘‘పేదలను వెళ్లగొట్టు - ఒవైసీని కాపాడు’’ అంటూ తెలంగాణలో కాంగ్రెస్ పాలన రెండు రకాలుగా సాగుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ రెండు రకాల పాలన: సంజయ్
హైదరాబాద్ సిటీ, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ‘‘పేదలను వెళ్లగొట్టు - ఒవైసీని కాపాడు’’ అంటూ తెలంగాణలో కాంగ్రెస్ పాలన రెండు రకాలుగా సాగుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. హైడ్రా, ప్రభుత్వ తీరుపై ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘పేదలకు బఫర్ జోన్లు- ఒవైసీకి కంఫర్ట్ జోన్లు’’, ‘‘పేదలకు ఫుల్‌ట్యాంక్ లెవెల్- ఒవైసీ లాభానికి ఫుల్ థాంక్స్ లెవెల్’’ అంటూ ఆయన పోస్ట్‌లో రాశారు. 200కు పైగా పేద కుటుంబాలను అణచివేయడానికి బుల్డోజర్లను మెరుపు వేగంతో తరలించారని, సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌లోని ఒవైసీ కళాశాల వద్ద మాత్రం యంత్రాలు స్తంభించి పోతాయని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ పీఎంఏవై ద్వారా పేదలకు గృహాలను నిర్మిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం ఇళ్లను కూల్చడానికి బుల్డోజర్లను పంపిస్తోందన్నారు. రజాకార్ వారసుల కోసం చట్టం వంగి, పేదల నడుములు విరుస్తోన్న వేళ, కనిపిస్తోన్నది పరిపాలన కాదని, అది వెన్నెముక లేని బుజ్జగింపు అంటూ బండి సంజయ్ ఎక్స్‌లో రాశారు.