రూ.48 లక్షల కోట్లు
ABN , Publish Date - Mar 24 , 2026 | 03:02 AM
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు.. ముడిచమురు సెగలతో మార్కెట్లు మలమల మాడిపోతున్నాయి. నాలుగో వారంలోకి ప్రవేశించి న యుద్ధం ఇప్పట్లో ఆగకపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలను...
పశ్చిమాసియా సంక్షోభంలో ఆవిరైన సంపద
సెన్సెక్స్ 1,837 పాయింట్లు డౌన్
22,500 స్థాయికి జారుకున్న నిఫ్టీ
చిన్న, మధ్య స్థాయి షేర్లు విలవిల
ఏడాది కనిష్ఠానికి 1,129 సంస్థల స్టాక్స్
లక్ష కోట్లకు ఎఫ్‌పీఐ విక్రయాలు
ముంబై: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు.. ముడిచమురు సెగలతో మార్కెట్లు మలమల మాడిపోతున్నాయి. నాలుగో వారంలోకి ప్రవేశించి న యుద్ధం ఇప్పట్లో ఆగకపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలను పోటెత్తించారు. దాంతో సూచీలు సోమవారం కుప్పకూలాయి. సెన్సెక్స్ ఒకదశలో 1,974.52 పాయింట్లు పతనమై 72,558.44 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 1,836.57 పాయింట్ల నష్టంతో 72,696.39 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 601.85 పాయింట్లు క్షీణించి 22,512.65 వద్ద ముగిసింది. ఫలితంగా బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.13.9 లక్షల కోట్లు తగ్గి రూ.415.21 లక్షల కోట్లకు పడిపోయింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సెన్సెక్స్ 8,590.8 పాయింట్లు (10.56ు), నిఫ్టీ 2,666 పాయింట్లు (10.58ు) కోల్పోగా రూ.48.29 లక్షల కోట్ల మార్కెట్ సంపద ఆవిరైపోయింది.
సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్ మినహా అన్నీ నష్టపోయాయి. టైటాన్ షేరు 6.24ు క్షీణించి సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది.
బీఎ్‌సఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ (3.82ు), స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ (3.66ు), అన్ని రంగాలవారీ సూచీలు నష్టపోయాయి..
జూబీఎ్‌సఈలో 4,556 కంపెనీల షేర్లు ట్రేడవగా.. 3,858 నష్టపోయాయి. అందులో 1,129 సంస్థల స్టాక్స్ సరికొత్త ఏడాది కనిష్ఠానికి జారుకోగా.. 10 లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
14 నెలల గరిష్ఠానికి బాండ్ల రేట్లు
భారత ప్రభుత్వం జారీ చేసే 10 ఏళ్ల కాలపరిమితి బాండ్ల వడ్డీ రేటు ఒకదశలో 14 నెలల గరిష్ఠ స్థాయి 6.8173 శాతానికి పెరిగింది. క్రూడ్ ధరలు, రూపాయి క్షీణత ఇందుకు ప్రధాన కారణాలంటున్నారు.
ఎఫ్‌పీఐలు..పీఛేముడ్
విదేశీ పోర్ట్‌ఫోలియో(ఎఫ్‌పీఐ) మన మార్కెట్ నుంచి భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఈ నెలలో 20వ తేదీ వరకు వారు రూ.88,180 కోట్లు వెనక్కి తీసుకున్న ఎఫ్‌ఐఐలు.. సోమవారం మరో రూ.10,414.23 కోట్ల నికర విక్రయాలు జరిపా రు. ఈ నెలలో ఇప్పటివరకు వారి అమ్మకాలు రూ.98,594.23 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిపిన విక్రయాలు రూ.1,11,941.23 కోట్లకు పెరిగాయి.
ఇవి కూడా చదవండి
పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..
మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం