ఏబీఎన్‌పై దాడిని ఖండించిన కేంద్ర మంత్రులు
ABN , Publish Date - Feb 01 , 2026 | 06:50 PM
బీఆర్ఎస్ భవన్ దగ్గరకు కవరేజ్ కోసం వెళ్లిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన కెమెరా జర్నలిస్ట్ పవన్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ భవన్ దగ్గరకు కవరేజ్ కోసం వెళ్లిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) సంస్థలకు చెందిన కెమెరా జర్నలిస్ట్ పవన్‌పై ఇవాళ(ఆదివారం) బీఆర్ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు వేర్వేరుగా ఓ ప్రకటన విడుదల చేశారు.
దాడి మంచి సంప్రదాయం కాదు: కిషన్‌రెడ్డి
మీడియా ప్రతినిధిపై దాడి మంచి సంప్రదాయం కాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దాడి చేసిన వారిని గుర్తించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరూ దీన్ని ఖండించాలని కోరారు. బాధ్యతగల రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. గతంలో మీరు పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నారని.. ఇది మంచి సంస్కృతి కాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ గూండాల తీరు బాధకరం: బండి సంజయ్
తెలంగాణ భవన్ వద్ద ఏబీఎన్ సిబ్బందిపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి అమానుషమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కవరేజ్ నిమిత్తం వెళ్లిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన కెమెరా జర్నలిస్ట్ పవన్‌పై బీఆర్ఎస్ గూండాల తీరు బాధకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియాది కీలక పాత్ర అని ఉద్ఘాటించారు. ప్రజల కోసం పనిచేసే నాలుగవ స్తంభంపై బీఆర్ఎస్ దాడులు చేస్తామంటే చూస్తూ ఉరుకోమని బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.
దాడి అమానుషం: మంత్రి తుమ్మల
తెలంగాణ భవన్ వద్ద ఏబీఎన్ సిబ్బందిపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి అమానుషమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కవరేజ్ నిమిత్తం వెళ్లిన ఏబీఎన్ సిబ్బందిపై బీఆర్ఎస్ గూండాల తీరు బాధాకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియాది కీలక పాత్ర అని చెప్పుకొచ్చారు. ప్రజల కోసం పనిచేసే నాలుగవ స్తంభంపై బీఆర్ఎస్ దాడులు చేస్తామంటే చూస్తూ ఉరుకోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కెమెరా జర్నలిస్ట్‌పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి
అక్రమ కేసులను ఎదుర్కొంటాం.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
Read Latest Telangana News And AP News And Telugu News