కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు.. పూర్తి వివరాలివే..
ABN , Publish Date - Oct 31 , 2026 | 03:32 PM
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో నవంబర్ 2వ తేదీన పర్యటించనున్నారు. రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
హైదరాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) తెలంగాణలో నవంబర్ 2వ తేదీన పర్యటించనున్నారు. రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. బేగంపేట నుంచి కాకతీయ హోటల్‌కు వెళ్లనున్నారు. 4గంటల వరకు కాకతీయ హోటల్‌లో కేంద్ర హోం మంత్రి బసచేయనున్నారు. 4గంటలకు బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు నిర్వహించనున్న ర్యాలీలో అమిత్ షా పాల్గొననున్నారు.
5 గంటల నుంచి 5:30 వరకు ఎంజే మార్కెట్ వద్ద జరిగే కార్నర్ మీటింగ్‌కు అమిత్ షా హాజరుకానున్నారు. అనతరం 6గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4గంటల వరకు ఉన్న రిజర్వ్ షెడ్యూల్‌లో రాష్ట్రంలోని ప్రముఖులను కేంద్ర హోం మంత్రి కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ ముఖ్య నేతలతో కూడా అమిత్ షా భేటీ అయ్యే ఛాన్స్ ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News