రుచిగా ఉందని తిన్నారో..!
ABN , Publish Date - Mar 16 , 2026 | 11:19 AM
కుత్బుల్లాపూర్ జోనల్ పరిధిలోని జీడిమెట్ల, చింతల్, గాజులరామారం, నిజాంపేట, దుండిగల్, కొంపల్లి సర్కిళ్ల పరిధిలో కొన్ని పెద్ద హోటళ్లతో పాటు రోడ్ల పక్కన నిర్వహిస్తున్న కొన్ని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు అపరిశుభ్రతకు కేరా్‌ఫగా మారుతున్నాయి.
కలుషిత ఆహార పదార్థాలతో ఆరోగ్యం హరీ
పరిశుభ్రత పాటించని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫెన్ సెంటర్లు
నాసిరకం నూనెతో వంటలు
ఇష్టానుసారం రంగుల వినియోగం
నాసిరకం ఆహారం తిని అనారోగ్యం పాలవుతున్న జనం
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ జోనల్ పరిధిలోని జీడిమెట్ల, చింతల్, గాజులరామారం, నిజాంపేట, దుండిగల్, కొంపల్లి సర్కిళ్ల పరిధిలో కొన్ని పెద్ద హోటళ్లతో పాటు రోడ్ల పక్కన నిర్వహిస్తున్న కొన్ని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు అపరిశుభ్రతకు కేరా్‌ఫగా మారుతున్నాయి. వీటిలో లభించే కలుషిత ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి.
షాపూర్‌నగర్, చింతల్, మహదేవపురం, సూరారం(Suraram), ఐడీపీఎల్, సుచిత్ర, పద్మానగర్, గణే్‌షనగర్, జయరాంనగర్, సుభా్‌షనగర్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లలో కనీస జాగ్రత్తలు పాటించకుండా బహిరంగ ప్రదేశాల్లో ఆహార పదార్థాలను వండుతున్నారు. కొందరైతే కలుషిత నీటితో పాత్రలను శుభ్రం చేయడం, కలుషిత నీటితోనే పిండి కలపడం వంటివి చేస్తున్నారు. ఇలా వండిని ఆహార పదార్థాలను ఆరు బయటే పెట్టి విక్రయిస్తుండటంతో వాటిపై దుమ్ము, ధూళి పడుతోంది. వంట చేసుకొనే తీరికలేని ఉద్యోగులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, అద్దె గదిల్లో ఉండే బ్యాచిలర్స్, విద్యార్థులు తక్కువ ధరకు రుచికరమైన ఆహారం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ ఆహార పదార్థాలను తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.
అనారోగ్యం వచ్చే అంశాలు
రోడ్డు పక్కన లభించే భోజనం, ఇతర ఆహార పదార్థాలను నాణత్య లేని నూనెతో వండుతున్నారు. అంతేకాకుండా బజ్జీలు, పూరీలు, పునుకులు, చపాతీలు, జిలేబీ, పకోడి వంటివి వండేందుకు ఒకసారి ఉపయోగించిన నూనెనే మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నారు. ఇలా తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల శరీరంలో ట్రాన్స్‌ప్యాట్స్ పెరుగుతాయని, దీని వల్ల గుండెపోటు, క్యాన్సర్ వంటి వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు.
చపాతీ, మైదా వంటి పిండి కలిపేందుకు, ప్లేట్లను కలిగేందుకు కలుషిత నీటిని వినియోగిస్తున్నారని, ఇలాంటి హోటళ్లలో ఆహారం తింటే టైఫాయిట్, కలరా, పచ్చ కామెర్లు వచ్చే అవకాశం ఉందని, ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు వాడుతున్న రంగుల వల్ల కూడా జీర్ణ వ్యవస్థ పాడవుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

రోడ్ల పక్కన నడుపుతున్న చాలా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ అధికారులు, ఆహార తనిఖీ అధికారులు ఇలాంటి హోటళ్లపై తనిఖీ చేయకపోవడంతో నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రతో కూడిన ఆహారాన్ని అందజేయాల్సిన బాధ్యత హోటళ్ల నిర్వాహకులపై ఉంది. పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. నిబంధనలు పాటించని, వినియోగదారులకు పరిశుభ్రతతో నాణ్యమైన ఆహారం అందించని హాటళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
- పింకేష్ కుమార్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్
ఈ వార్తలు కూడా చదవండి:
బ్రికెట్స్ స్టవ్ C/O బాలానగర్
Read Latest Telangana News and National News