Share News

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ.. అధికారులకు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:01 AM

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయిలో కమిషనర్ పర్యటించారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ.. అధికారులకు కీలక ఆదేశాలు
GHMC Commissioner

హైదరాబాద్, మార్చి 16: నగరంలోని పలు ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) కమిషనర్ ఆర్వీ కర్ణన్(GHMC Commissioner RV Karnan) ఈరోజు(సోమవారం) ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గోషామహల్, కార్వాన్ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటన చేపట్టిన ఆయన.. అభివృద్ధి పనులు, రోడ్లు, శానిటేషన్ విషయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. భగత్‌సింగ్ జంక్షన్ దగ్గర అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు.


తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు కమిషనర్ సూచించారు. ప్రజలకు రాకపోకలు సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ పరిసరాల్లో ఆక్రమణలను గుర్తించిన కమిషనర్.. వాటిని వెంటనే తొలగించాలని సూచనలు జారీ చేశారు. జియాగూడ 100 ఫీట్ రోడ్డు వద్ద శానిటేషన్ పరిస్థితులు, రోడ్డు అభివృద్ధి పనులను సమీక్షించారు. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

యాగశాల ప్రవేశంతో శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం

హనుమాన్ మాలతో స్కూల్‌కు విద్యార్థులు.. అడ్డుకున్న యాజమాన్యం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 16 , 2026 | 11:04 AM