Share News

కొత్త అమావాస్య వేళ.. పొరపాటున కూడా ఇలా చేయవద్దు?

ABN , Publish Date - Mar 16 , 2026 | 10:13 AM

ఏడాదిలో ప్రతి నెలలో ఒక అమావాస్య వస్తుంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాది ప్రారంభానికి ముందు కూడా అమావాస్య వస్తుంది.

కొత్త అమావాస్య వేళ.. పొరపాటున కూడా ఇలా చేయవద్దు?

ఏడాదిలో ప్రతి నెలలో ఒక అమావాస్య వస్తుంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాది ప్రారంభానికి ముందు కూడా అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య వెళ్లిన తర్వాత తెలుగు సంవత్సరాది వస్తుంది. అందుకే కొత్త సంవత్సరాది వేళ.. తెలుగు లోగిళ్లలో ఉగాది పండగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

అయితే ఉగాది ముందు వచ్చే అమావాస్యను కొత్త అమావాస్య అని పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారంటే.. ఇది పాత సంవత్సరానికి ముగింపుగా.. కొత్త ఏడాదికి ముందు వచ్చే చివరి రోజు కావడం వల్ల దీనికి కొత్త అమావాస్య అని పేరు వచ్చిందని చెబుతారు. ఈ రోజు పితృదేవతలను పూజించి.. కొత్త ఏడాదిలో అంతా శుభం కలగాలని కోరుకుంటారు.


కొత్త అమావాస్య రోజు..

పితృ తర్పణాలు.. ఈ రోజు పూర్వీకులకు నువ్వులతో తర్పణాలు వదలడం చాలా విశిష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు ఒక పూట ఉపవాసం ఉండి పరమశివుడిని ఆరాధించడం వల్ల పితృదేవతలు సంతృప్తి పొందుతారని విశ్వసిస్తారు.


ఈ రోజు మాత్రం ఇలా చేయవద్దని చెబుతారు..

  • కొత్త అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యాస్తమయం తర్వాత చీపురు వాడకూడదు.

  • రాత్రి సమయంలో దుస్తులు ఉతికి ఆరుబయట ఆరబెట్టకూడదు.


  • సాధారణంగా అమావాస్య వేళ.. మనస్సు, భావోద్వేగాలు అధికంగా ప్రభావితమవుతాయి. ఎందుకంటే ఈ రోజు చంద్రుడు కనిపించడు. చంద్రుడు మనస్సుకి కారకుడు. అందువల్ల కోపం, గొడవలు, చెడు మాటలు మాట్లాడకుండా ఉండడం ఉత్తమం. అలా కాకుంటే వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితానికి నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి.

  • ఈ రోజు.. మద్యం, మాంసం, మత్తు పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అమావాస్య వేళ.. పితృదేవతలను ఆరాధిస్తారు. అందువల్ల ఎవరిని బాధపెట్టకూడదు. ఈ రోజు ధాన ధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుంది.


కొత్త అమావాస్య ఘడియలు..

మార్చి 18వ తేదీ బుధవారం ఉదయం 7.50కు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది.

మార్చి 19వ తేదీ గురువారం ఉదయం 7.05కు ఈ తిథి ముగియనుంది.


ఈ వార్తలు కూడా చదవండి.. స

శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు

ఉగాది నుంచి ఈ రాశులకు బంగారు సిరులు..!

For More Devotional News And Telugu News

Updated Date - Mar 16 , 2026 | 10:30 AM